ఏపీ ముఖ్య‌మంత్రి,వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ఇప్ప‌టికే వివిధ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో మ‌రో కీల‌క‌మైన వ‌ర్గం చేరింది. అగ్రిగోల్డ్ బాధితుల్లో...రూ10 వేల నుంచి రూ 20 వేల లోపు డిపాజిట్లను నేరుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని ప్ర‌భుత్వం చెలించనుంది. బాధితుల కోసం వార్షిక బడ్జెట్‌లో రూ 1,150 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్‌ నిధుల నుంచి మొదటి దశలో రూ. 264 కోట్లను మంజూరు చేసింది. ఈ నిర్ణ‌యంతో...ఏపీలోని 9.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దీపావళి పర్వదినానికి ముందే బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. 


ఈ నేప‌థ్యంలో...తాజాగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్టోబరు 29 ఉదయం 10.30 గంటలకు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని ఆ కమిటీ కో ఆర్డినేటర్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ముఖ్య ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ  సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని అప్పిరెడ్డి తెలిపారు.


ప్రజాసంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు..అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి   వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 1150 కోట్లు మంజూరుకు శ్రీకారం చుట్టారని అప్పిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ... అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో.. బాధితుల పక్షాన నిలబడి, వారికి కొండంత ధైర్యాన్ని, భరోసాను జగన్ మోహన్ రెడ్డి కల్పించారని పేర్కొన్నారు.  తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: