రోజులు మారుతున్నాయంటే తెలియని వారు ఏంటో అనుకుంటారు. కాని నిజంగానే రోజులు మారాయి. ఎలాగంటే ప్రేమ, మోహం, క్రోధం, లోభం  లాంటి విషయాల్లో చాలా మార్పులు జరిగాయి. అంతే కాకుండా మనిషి ఆలోచనల్లో కూడా ఊహించ లేనంతగా మార్పు సంభవించింది. తనకు నచ్చింది ఏంచేసైనా స్వంతం చేసుకుంటున్నాడు. అంతే కాకుండా తనకు నచ్చినట్లుగా నడచుకోని వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇదేకాకుండా కోపంలో ఏం చేస్తున్నామో తెలుసుకోలేని స్దితిలోకి వెళ్లుతున్నారు.


ఇక సింగపూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. కోపంలో తాను చేసినపని ఆడవాళ్లకే తలవంపు తెచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే సింగపూర్‌లో మహిళ ట్యాక్సీ డ్రైవర్‌తో గొడవ పడింది. అతన్ని కొట్టడానికి కూడా ప్రయత్నించింది. దాంతో అతడు తన కారుని స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. అతన్ని పట్టుకోవాలని చూసిన ఆ మహిళ అతను దొరకలేదని రోడ్డుపైనే ఆగి అతను వెళ్లినవైపే చూస్తూ నిల్చుంది. అంతటితో ఊరుకోకుండా ఆ ట్యాక్సీ డ్రైవర్‌ చేతికి చిక్కలేదన్న అక్కసుతో ఆమె వంటిపై ఉన్న దుస్తులను విప్పడం మొదలు పెట్టింది. చివరికి లోదుస్తులు కూడా విప్పేసింది.


ఇదంతా చూస్తున్న  ఓ వ్యక్తి ఆమె విసిరేసిన దుస్తులను తీసుకెళ్లి ఇచ్చాడు. ఆ తర్వాత రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లి దుస్తులు వేసుకోవాలని కోరాడు. ఈలోపల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ట్యాక్సీ డ్రైవర్‌తో ఆమె ఎందుకు గొడవ పడిందనే విషయం తెలియరాలేదు.


ఇకపోతే ఈ సంఘటన  సింగపూర్‌లో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇక అక్కడ జరిగే తతంగమంతా దూరంగా ఉన్న లారెన్స్ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 146,000 మంది వీక్షించారు. ఇకపోతే కోపం వస్తే స్పందించాలే గాని మరీ పరువు పోయేలా ప్రవర్తించ కూడదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వారు..


మరింత సమాచారం తెలుసుకోండి: