చినజీయర్ స్వామీజి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామీజీ ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు జరిగాయి. కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. చినజీయర్ స్వామీజీ కేసీఆర్ కు సత్య సంకల్ప పుసకాన్ని అందజేశారు. చినజీయర్ స్వామీజీ కేసీఆర్ దంపతులను శాలువాలతో సత్కరించారు. 
 
సీఎం కేసీఆర్ దంపతులతో పాటు మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ముచ్చింతల్ ఆశ్రమానికి ప్రముఖులు, భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కూడా పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. జీయర్ స్వామి వేద పండితులకు పురస్కారాలను అందజేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భగవంతున్ని పూజించే సంస్కారం తల్లిదండ్రుల నుండి వచ్చిందని అన్నారు. 
 
సిద్ధిపేటలో చినజీయర్ స్వామి బ్రహ్మయజ్ఞం చేయాలని అనుకున్న సమయంలో చినజీయర్ స్వామి 7 రోజులు మా ఇంట్లోనే బస చేశారని కేసీఆర్ చెప్పారు. చినజీయర్ స్వామి యాగం మధ్యలో లేదా యాగం ముగింపులో వర్షం వస్తుందని చెప్పారని కానీ మేము నమ్మలేదని కానీ అద్భుతమైన వర్షం యాగం పూర్తయిన తరువాత కురిసిందని కేసీఆర్ చెప్పారు. చినజీయర్ స్వామి మాట్లాడుతూ కేసీఆర్ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని అన్నారు. 
 
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా రావటం సంతోషంగా ఉందని చినజీయర్ స్వామి అన్నారు. కొందరు నేతలు పబ్లిక్ గా అధ్యాత్మిక కార్యక్రమాలు చేయటానికి వెనుకంజ వేస్తారని సీఎం కేసీఆర్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని అన్నారు. కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మఠపల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించానని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని చినజీయర్ స్వామి అన్నారు. బక్కవాడైనా కేసీయార్ గొప్పవాడని మనస్సులో ఉన్న భక్తిని దాచుకోకుండా చెప్పగలడని చినజీయర్ స్వామీజీ కొనియాడారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: