జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని  congress party YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళ్తాడు అన్న చందంగా ఆయన రాజకీయ పర్యటనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి ఏమీ తెలియదన్నారు. అందుకే ఆయనకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎప్పటికి ఆయన ఊళ్ళు  పట్టుకుని తిరగాల్సిందేనన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే ఆయన party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి అధ్యక్షుడిగా ఉంటాడా.. ఉండడా అనేది కూడా తెలియడం లేదన్నారు. త్వరలో party TDP' target='_blank' title='తెలుగుదేశం పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందన్నారు. దాంతో  ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియని గందరగోళ పరిస్దితిలో పడిందన్నారు. కొంత మంది ఎంపీలు ఆ పార్టీనుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు సైతం వెళ్లిపోతున్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నైజం తెలుసుకున్నారు. అందుకే ఆయనకు 23 సీట్లు ఇచ్చారు. అవి కూడా రాబోయో రోజులలో పోబోతున్నాయని జోశ్యం చెప్పారు. 


కార్మికుల పక్షాన మాట్లాడుతున్నామని అనిపించుకునేందుకు  చంద్రబాబు,  పవన్ కల్యాణ్ లు బిల్డప్ ఇస్తున్నారనితీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టంలో విశ్వాసం కోల్పోయిన నేతలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విష ప్రచారం చేస్తున్నారు.కృత్రిమకొరత సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా అని ఎదురు ప్రశ్నించారు. వరదలు, వర్షాల నేపధ్యంలో అటు కృష్ణా,ఇటు గోదావరి నదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఇసుక తీయడం సాధ్యపడదనే విషయం ప్రజలు గమనిస్తున్నారని రమేష్ తెలిపారు.ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఇప్పటికీ ఆన్ లైన్  లో కోరిన వారికి ఇసుక పంపించడం జరుగుతుందని చెప్పారు. నిజానికి కార్మికులకు ఏం కావాలో అవి నెరవేర్చేందుకు తమ  ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. 



ఈ సీజన్ లో నిర్మాణాలు కొనసాగవనే విషయం అందరికీ తెలుసు. ఇసుక వల్ల కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే.అవినీతి లేకుండా ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోంది. అయినా చంద్రబాబు హయాంలో చంద్రబాబు నివాసం ఉన్న చుట్టుపక్కలనుంచి ప్రతిరోజు వందలలారీలు ఇసుక అక్రమ రవాణా జరగుతుంటే అరికట్టేందుకు చర్యలు ఏమైనా తీసుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. నీ(చంద్రబాబు) అనుయాయులు,ఎంఎల్ ఏలు,మంత్రులు వందలువేల కోట్లు ఇసుక అక్రమరవాణా ద్వారా దోచుకుంది వాస్తవం కాదా. ప్రతిపక్షనేత రాష్ర్టంలో ఉన్నాడా అని విధంగా తయారయ్యారు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో జలాశయాలన్నీ కూడా నిండుకుండల్లా ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.నదులు సముద్రాలను తలపిస్తున్నాయి. సెలయేర్లు జలపాతాలను తలపిస్తున్నాయి.



గ్రామాలలో సాగునీరు, తాగునీరు చాలా ఏళ్ల తర్వాత సమృధ్దిగా లభించాయని ప్రజలందరూ అంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించాడని అది  వైయస్ జగన్ వల్లనే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. గ్రామసచివాలయఉద్యోగుల ద్వారా సైతం ఇసుక కావాల్సిన వారికి అందించేఏర్పాటుచేస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వందకోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదా అని నిలదీశారు. జగన్  ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు.రైతులు,ఆటోకార్మికులు,నవరత్నాలు ఇలా అన్నింటిని నెరవేరుస్తున్నారు. ఎంతమంది మా పార్టీలోకి రావాలనుకున్నా, జగన్  నాయకత్వం కావాలనుకున్నవాళ్లు జగన్  అనుసరిస్తున్న విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని ఎమ్మెల్యే జోగి సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: