తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పూజలు పునస్కారాలు  అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే  . ఆయన హోమాలు నిర్వహించేందుకు ఎంత ప్రాధాన్యత నిస్తారో  తెలంగాణ ప్రజలు ఎరుగనిది కాదు. పూజలకి హోమలకి   ఎక్కువగా నిర్వహిస్తుంటారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు దైవచింతన ఎందుకు ఎక్కువ అనే విషయాన్ని తాజాగా ఓ  పూజా  కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ శివార్లలో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో ... తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు ...కాగా ఈ వేడుకలకు  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. 



 ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనకి దైవచింతన చాలా ఎక్కువని... భగవంతుని పూజించే సంస్కారం ఆచారం... తనకి తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించినదని  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తమ కుటుంబమంతా  జై శ్రీమన్నారాయణ అనే నామస్మరణతో ... వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు చిన్నప్పుడే పెళ్లి అయిందని... తనది బాల్య వివాహం అని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... 14వ ఏటనే తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. కాగా  వరంగల్ జిల్లా చిత్తూరులో తన పెళ్లి అయిందని కేసీఆర్ వెల్లడించారు. 



 తమ పెళ్లి  ఆధ్యాత్మిక గురువు సమక్షంలోనే జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తన చిన్నప్పుడు ఆధ్యాత్మిక గురువులు తమ ఇంటికి వచ్చే వారిని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కాగా  తమ ఇంటికి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు... నెల రోజుల పాటు తమ ఇంట్లో  ఉండేవారని తెలిపారు. ఆధ్యాత్మిక గురువులు పురాణాలు ఇతిహాసాలు తనకు వివరించే వారిని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే  చిన్నప్పుడు నుంచి ఆధ్యాత్మిక గురువులు చెప్పిన ఇతిహాసాలు పురాణాలు బాగా వినడంతో ... తనకు చిన్నప్పటి నుంచి భక్తి భావం పెంపొందిందని  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: