వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైనట్టుంది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ వైసీపీకి సోమవారం నాడు రాజీనామా చేశారు.దగ్గుబాటి వెంకటేశ్వరావు ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.
 అంతేకాదు తాజాగా ఆయన వైసీపీ పార్టీకీ రాజీనామా చేస్తునట్టు ప్రకటించాడు. 


ఆయనతో పాటు ఆయన కుమారుడు  వైసీపీ పార్టీకీ రాజీనామా చేస్తునట్టు ప్రకటించాడు. ఇలాంటి నేపధ్యంలో వైసీపీ పార్టీనీ మరింత పటిష్టం చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.  అయితే ఈ ఎన్నికలలో వైసీపీ తరుపున పరుచూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై జగన్ ఒక కొత్త డిమాండ్ ఉంచారట. ఆ డిమాండ్ కు దగ్గుబాటి సుముఖంగా లేరని తెలుస్తుంది. 


అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజీనామాతో వైసీపీ మాజీ నేత రఘునాథం బాబును తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు అధినేత జగన్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో అప్పటివరకు వైసీపీ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న రామనాథంబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అందుకే  త్వరలోనే రఘునాథంకు మలళ్ళి  నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పాలని కూడా అనుకుంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి బీజేపీలో కీలక పదవి కోసం పోటీ పడుతూ ... అయితే ఆమె బీజేపీనీ వీడడానికి ఒప్పుకోలేదు.


ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డికి ఫోన్ దగ్గుబాటు చేసినట్టు తెలుస్తుంది.  రాజీనామాల విషయంలో ప్రత్యేకంగా ఎవరిని కలిసేందుకు ప్రయత్నించనని తెలిపారు.  జగన్ పెట్టిన షరతులకు తలొగ్గకుండా ఉండేందుకు గాను వైసీపీని వీడాలని నిర్నయం తీసుకొన్నారని అంటున్నారు. ఈ మేరకు సోమవారం నాడు వైసీపీని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ రాజీనామాని సమర్పించారు. 2019 ఎన్నికలలో ఓటమిపాలైన టీడీపీ ముఖ్య నేతలు  నుంచి అటు వైసీపీ, బీజేపీలోకి భారీగా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుండి నేతలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: