జ‌న‌సేన అధ్య‌క్షుడు...సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప‌వ‌న్ పేరుతో అడ్డంగా డ‌బ్బులు దండుకుంటున్న విష‌యం బ‌ట్ట‌బయ‌లైంది. ఆయ‌న త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మానికి న‌కిలీల బెడ‌ద మొద‌లైంది. దీంతో ఏకంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి...డ‌బ్బుల వ‌సూలుకు...త‌న‌కూ ఏ సంబంధం లేద‌ని...ప‌వ‌న్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఇదంతా....భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నవంబర్ 3 తేదీ విశాఖలో త‌ల‌పెట్టిన‌ లాంగ్ మార్చ్ కోసం కొంద‌రు డ‌బ్బులు దండుకుంటున్న ఉదంతం గురించి.


వివ‌రాల్లోకి వెళితే...ఇటీవ‌ల హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఇసుక, లిక్కర్ పాలసీలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “ఎన్నికల అనంతరం భీమవరం పర్యటనకు వెళ్లిన సందర్భంలో సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఇసుక రీచ్ లలో ఉన్న సమస్యలపై మాట్లాడాలని కోరారు. ఈ సమస్య మీద దృష్టి సారించాం. అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇసుక రీచ్ లు, డంపింగ్ యార్డుల వద్దకు వెళ్లి ధరల్లో ఉన్న తేడాలను ప్రజల ముందు ఉంచాం. ఇసుక మాఫియాను ప్రోత్సహించడమే తెలుగుదేశం పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.తెలుగుదేశం పార్టీ పరాజయానికి మూలకారణం అయ్యింది. వైసిపి వస్తే పరిస్థితి మారుతుందని ప్రజలు అనుకున్నారు.టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. టీడీపీ పోయి వైసిపి రావడం మినహా మార్పు ఏమీ జరగలేదు.భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారి కన్నీరు తుడిచి, వారి ఆవేదనను ప్రజలకు తెలియచేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీసి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం.`` అని ప్ర‌క‌టించారు.


విశాఖ వేదిక‌గా లాంగ్ మార్చ్ రూపంలో చేపట్టనున్న ఈ ఉద్యమానికి పార్టీ జనరల్ సెక్రటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు తోట చంద్రశేఖర్ నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఛలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశాల‌ను నిర్వహించారు. అనంత‌రం లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించే షెడ్యూల్ ఖ‌రారు చేశారు. 30 వ తేదీన భవన నిర్మాణ కార్మికుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాలని నాయకులకు, శ్రేణులకు సూచించారు. 
ఓవైపు పార్టీ ఇలా ముందుకు సాగుతుంటే...మ‌రోవైపు `ఛలో విశాఖపట్నం కార్యక్రమం నిర్వహణకు నిధులు ఇవ్వండి` అంటూ సోష‌ల్ మీడియాలో కొంద‌రు అభ్య‌ర్థించారు. జ‌న‌సేన బ‌లోపేతం కోసం స‌హ‌క‌రించాల‌ని కోరారు. అయితే, వీరు న‌కిలీలు అని తేలింది. దీంతో పార్టీ ఏకంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ``ఛలో విశాఖపట్నం కార్యక్రమం నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. వాటి ద్వారా విరాళాలు సేకరిస్తున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఇలాంటి ఖాతాలను ఎవరూ నమ్మవద్దు`` అని శ్రేణులకు,పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన మద్దతుదారులకు పార్టీ సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: