ఏ నేత అయిన అధికార పార్టీలో ఉంటే ఏదొక పదవి వస్తుందనే ఆశిస్తారు. సీనియర్ నేతలైతే ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తారు. అలా ఆశగా ఎదురుచూసే నేతల్లో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా ఒకరు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటంతో తనకు తగ్గ పదవే వస్తుందని దాడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది. సీఎం జగన్ చాలా మంది నేతలకు నామినేటెడ్ , తదితర పదవులు కట్టబెట్టారు.


కానీ సీనియర్ దాడికి మాత్రం ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. భవిష్యత్ లో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా అంటే అనుమానంగానే ఉంది. ఎందుకంటే దాడి ముందు నుంచి వైసీపీలోనే కొనసాగి ఉంటే మంచి పొజిషన్ లోనే ఉండేవారు. కానీ ఆయన మధ్యలో రాంగ్ స్టెప్ వేయడం వల్లే ఇప్పుడు అధికారం ఉన్న సాధారణ నేతగానే మిగిలిపోయారు. అసలు దాడి రాజకీయం టీడీపీలో మొదలైంది. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రి కూడా చేశారు. అయితే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి పొడిగించలేదని కుమారుడు దాడి రత్నాకర్ తో కలిసి వైసీపీలోకి వచ్చారు.


అప్పుడు జరిగిన ఎన్నికల్లో దాడి కుమారుడుకు జగన్ విశాఖ నార్త్‌ టికెట్ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓటమి పాలయ్యారు. అలాగే వైసీపీ కూడా అధికారంలోకి కూడా రాలేదు. దీంతో కొన్ని రోజుల సైలెంట్ గా ఉన్న దాడి...కుమారుడుతో పాటు బయటకొచ్చేశారు. అయితే ఏ పార్టీలో చేరకుండా అలాగే ఉండిపోయారు. ఇక మొన్న ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. కానీ జగన్ సీటు ఏం ఇవ్వలేదు. అనకాపల్లి లో గుడివాడ అమర్నాథ్ విజయానికి కృషి చేయాలని సూచించారు.


అలాగే దాడి...గుడివాడ విజయ కోసం కృషి చేశారు. గుడివాడ గెలిచాడు. వైసీపీ కూడా అత్యధిక సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు ఏదొక పదవి వస్తుందని దాడి అనుకుంటున్నారు. ఇప్పటికే రాజ్యసభ సీటు కోసం విజయసాయిరెడ్డి ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోనీ తనకు కాకపోయిన తన కుమారుడుకు ఏదొక పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి జగన్ దాడికి... పదవి ఇస్తారో? లేదో?


మరింత సమాచారం తెలుసుకోండి: