తొలిసారి సీఎం పదవి చేపట్టిన జగన్...చాలా వ్యూహాత్మకంగా పాలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావొస్తుంది. ఈ ఐదు నెలల్లోనే అనేక సంచలన నిర్ణయాలు, పథకాలు తీసుకొచ్చారు. అయితే ఒక్కో నిర్ణయం వెనుక జగన్ అదిరిపోయే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనబడుతుంది. ఒక్కో పథకం ద్వారా ఆయా వర్గాలని మెప్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అలా జగన్ అన్నీ వర్గాలని తనవైపు పాజిటివ్ గా తిప్పుకుంటున్నారు.


అందులో ముఖ్యంగా జగన్ నిరుద్యోగులని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనబడుతోంది. ఎన్నో ఏళ్లుగా ఏపీని నిరుద్యోగం పట్టి పీడిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి సమస్యలని పరిష్కరించలేకపోయారు. కానీ ఐదు నెలల్లోనే వారి సమస్యలకు చెక్ పెట్టారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల పేరిట ఉద్యోగాలు నియమించారు. ఉద్యోగాల భర్తీకి ఓ నాన్చకుండా రెండునెలల్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం, ఉద్యోగాలు భర్తీ చేయడం చేసేశారు.


ఇంతలా జగన్ నిరుద్యోగులని టార్గెట్ చేసుకుని, వారికి ఉద్యోగాలని కల్పించడం వెనుక మంచి వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. మొన్న ఎన్నికల్లో ఏపీలోని ఎక్కువ యువత జగన్ వైపే మొగ్గు చూపారు. అయితే వచ్చే ఎన్నికలనాటికి పూర్తి స్థాయిలో యువత మద్ధతు కూడబెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకనే వారికి భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇటీవల గ్రామ సచివాలయం పోస్టులకు దాదాపు 20 లక్షల మంది పరీక్షలు రాశారు. వారిలో అర్హత కలిగిన లక్ష మందికే ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వదిలి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు.


ఇక తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో భర్తీ కానీ పోస్టులకు అర్హత కటాఫ్ తగ్గించి అభ్యర్ధులని సెలెక్ట్ చేస్తామని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ,ఎస్టీలకు కటాఫ్ తగ్గించారు కూడా. కొన్ని చోట్ల సున్నా మార్కులు వచ్చిన అభ్యర్ధులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా బీసీ, ఓసీ అభ్యర్ధులకు కూడా కటాఫ్ తగ్గించడానికి చూస్తున్నారు . దీని వల్ల మరో 25 వేల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశముంది. అటు ఖాళీలు ఉన్న గ్రామ వాలంటీర్ల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు.  జగన్ ఈ విధంగా ఏపీ యువతని ఆదుకుంటూనే..తమకు పాజిటివ్ గా మార్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: