ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు.. గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారాలు హాట్ హాట్ గా ఉన్నాయి. దగ్గుబాటి దంపతులు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని సీఎం జగన్ పెట్టిన ష‌ర‌తుతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీకి రాజీనామా చేయటం దాదాపు ఖరారైందని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ సైతం దగ్గుబాటిని పార్టీలో పొమ్మ‌న‌కుండా పొగ పెట్టేలా ఇప్పటికే చాపకింద నీరులా స్కెచ్‌ వేశారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి తన అనుచరులతో సమావేశమై తన భార్య రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వైసీపీని వీడాల‌ని నిర్ణయించుకున్నామని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.


ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న‌పై తాజా అప్‌డేట్ వ‌చ్చింది. దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాము రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నామని, వైసీపీకి రాజీనామా చేస్తున్నామని తెలిపార‌ని టాక్‌. రాజీనామా విషయంలో ఎవరినీ కలిసేది లేదని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన రావి రామనాథం బాబును తిరిగి పార్టీలో చేర్చుకున్న విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని ద‌గ్గుపాటి ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డితో చెప్పిన‌ట్టు తెలుస్తోంది.


తనతో పాటు తన కుమారుడు దగ్గుబాటి హితేశ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన విజయసాయిరెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా జ‌గ‌న్ కూడా ముందు నుంచి ద‌గ్గుబాటి దంప‌తుల విష‌యంలో సీరియ‌స్‌గానే ఉన్నారు. వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీలో ఉండి... పురందేశ్వ‌రి బీజేపీలో ఉంటూ త‌మ పార్టీతో పాటు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న‌కు ఎంత మాత్రం రుచించ‌లేదు. ఈ నేప‌థ్యంలో వీరిని వ‌దిలించుకుంటేనే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చేశారు. ఇక పురందేశ్వ‌రి బీజేపీలో ఉండేందుకే నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వెంక‌టేశ్వ‌ర‌రావు, కుమారుడు పార్టీని వీడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: