ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసే అరాచకాలకు మత సిద్ధాంతాలు అధారాలు కావు. మానవత్వానికి స్థానం ఇసుమాత్రమూ లేదు. మహిళలను మతం పేరుతో కిడ్నాప్ చేసి తస్కరించటం ఆపై, అమానవీయంగా అతికర్కశంగా వారిపై  అత్యాచారం చేయటం వారి నిరంతర ప్రక్రియ. అయితే ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా - ఐసిస్ -పేరుతో ప్రపంచాన్ని గడగడ లాడించి వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్‌ అల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు ప్రణాళికా బద్దంగానే హత మార్చాయి. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశారు. 


వయాగ్రా మాత్రలు వేసుకుని మరీ రాక్షస మదన కాండ కొనసాగిస్తూ - వయో భేదం లేకుండా వేలాది మంది మహిళలపై అత్యాచారం చేసి వారిని కిరాతంగా హత్యచేసి ప్రపంచానికే చాలంజ్ చేస్తున్న అబు బాకర్ అల్ బాగ్దాదీ - చివరికి ఒక కుక్క వలన విధి లేని పరిస్థితిలో ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకుని అత్యంత హేయంగా హీనంగా కుక్కచావు చచ్చాడు. 


పసిపిల్లలు, మహిళలు అనే తేడా లేదు పిల్లలు, మహిళలు అంటే అబు బాకర్ అల్ బాగ్దాదీ (48) కామంతో రెచ్చిపోయే వాడు. వెంట వెంటనే అమ్మాయిలపై మదమెక్కి కామవాంఛ తీర్చుకోవడానికి వయాగ్రా మాత్రలు వరుసగా వేసుకునే వాడు. దయా దాక్షిణ్యాలు ఏమాత్రమూ లేని విచక్షణా రహిత పరమ క్రూరుడైన ఐసిస్ అధినేత రోజులో ఎక్కువ భాగం మహిళలపై అత్యాచారం చేయటానికే వినియోగించేవాడు! వయాగ్రా ఆయన ఆయుధం   


అమెరికా, సిరియాలతో పాటు అన్నీ దేశాలను గడగడ లాడించిన అబు బాకర్ అల్ బాగ్దాదీని అంతం చెయ్యడానికి అమెరికా లాంటి శక్తివంతమైన దేశానికే ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నరకాసుర హననానికి ప్రపంచం విసుగు విరామం లేకుండా నిరీక్షించింది. అమెరికా ఈ ఆపరేషన్ కు "కైలా ముల్లెర్" అని పేరు పెట్టింది. దీని వెనుక ఐసిస్ దుర్మార్గానికి ధారుణ అత్యాచారానికి గురైన ఒక స్త్రీ దయనీయ ఆత్మ ఘోష వినిపిస్తుంది.
Image result for kayla mueller

Yazidi girl held captive alongside Kayla Mueller reveals she tried to persuade the American hostage to escape with her 



అమెరికా లోని అరిజోనా ప్రాంతానికి చెందిన "కైలా ముల్లెర్" (28) అనే మహిళ ఒక స్వచ్చందా సేవా సంస్థ లో పని చేసేది. 2013 లో ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించడా నికి టర్కీ నుంచి అలెప్పో కు ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను ఐసిస్ కిడ్నాప్ చేసింది. తరువాత ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీ అనేక రోజులు కైలా ముల్లెర్ మీద అత్యంత క్రూరంగా మానవత్వం లేకుండా అత్యాచారం చేసి ఆమెను దారుణంగా హత్యచేశాడు. 2015లో ఐసిస్ చెరలో కైలా ముల్లెర్ మరణించిందని అమెరికా ధ‌ృవీకరించింది. ఇప్పుడు అమెరికా అబు బాకర్ అల్ బాగ్దాదీని అంతం చెయ్యడానికి "ఆపరేషన్ కైలా ముల్లెర్" పేరుతో తన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ముగించింది.  


ఈ విశ్వంలోనే నేటి నెంబర్ వన్ ఉగ్రవాది, ఐసీస్ వంటి ఉగ్రమూకను నడిపిస్తున్న అబు బాకర్ అల్ బాగ్దాదీని అంతం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నేడు ప్రపంచం హర్హాతిరేఖంతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాది అయిన బాగ్దాదీని అంతం చెయ్యటం అంత తేలికగా సాధ్యపడలేదు దాని వెనుక డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ సమాచారాన్ని అతిరహస్యంగా కాపాడుతూ జాగ్రత్తలు తీసుకున్నారని ఈ ఆపరేషన్ కైలా ముల్లెర్ లో ఒక రోబో  అబు బాకర్ అల్ బాగ్దాదీని అంతం చెయ్యడానికి వినియోగించేందుకు అమెరికా సిద్దమైంది. అయితే అబు బాకర్ అల్ బాగ్దాదీ దగ్గర "ఆత్మాహుతి సూట్" ఉండటంతో "రోబో ఆపరేటర్" కూడా మరణించే అవకాశం ఉండటంతో రోబోను ఉపయోగించే విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. 
Image result for kayla mueller

Kayla Mueller’s family reveals she was raped and tortured brutally murdered while in ISIS captivity

"కుక్కచావు" అని అంటూ ఉంటాం అనేక సందర్భాల్లో - అర్దరాత్రి సమయంలో అబు బాకర్ అల్ బాగ్దాదీ నివాసముంటున్న ఇంటి ప్రాంగణాన్ని అమెరికా హెలికాప్టర్లు చుట్టుముట్టాయి ఆ సమయంలో ఇంట్లోని వారంతా అమెరికా సైనిక దళాలపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడుకోవటానికి అబు బాకర్ అల్ బాగ్దాదీ ఇంట్లో నిర్మించుకున్న బంకర్ (సొరంగం) లోకి వెళ్లిపోయాడు. అప్పటికే బంకర్ సమాచారం ఉన్న అమెరికా దళాలు ఒక కుక్కను ఆ బంకర్ లోకి వదిలాయి. భయంకరమైన సైన్యం ఉపయోగించే వేట కుక్క వెంబడించడంతో భయపడి సొరంగం చివరికి వెళ్లిన అబు బాకర్ అల్ బాగ్దాదీ బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆమెరికా దళాలకు భయపడి ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చు కోవడంతో కుక్క చావు చచ్చాడు. ఆయనతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు కూడా ఆ బాంబ్ పేలుళ్ళకు బలయ్యారు. "వంద అడవి దున్నలను తిన్న రాబందు సైతం ఒక గాలి వానకు బలైనట్లు" - వందలాది మహిళలపై అమానవీయంగా, అతి కిరాతకంగా అత్యాచారాలు చేసిన ఈ మద మెక్కిన మానవ మృగం జీవితం అలా అంతమైంది.  




గతంలో అంటే 2011 ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను హతమార్చడానికి అమెరికా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా సైనికుల బలగాల దెబ్బకు బిన్ లాడెన్  విలవిల్లాడి అల్లాడి పోయాడు. కోట్లాది మంది అమెరికా ప్రజలకు నిద్రలేకుండా చేసిన బిన్ లాడెన్ ను ఎలాగైనా అంతం చెయ్యాలని అమెరికా నిర్ణయించింది. 2011 లో జరిగిన సీక్రెట్ ఆపరేషన్‌లో బిన్ లాడెన్ అంతం అయ్యాడు. బిన్ లాడెన్‌ను అంతం చేసినట్లే ఇప్పుడు అమెరికా సైనిక బలగాలు ఆయన నిర్మించిన ఈ మానవమృగం ఆధునిక నరకాసురుడైన అబు బాకర్ అల్ బాగ్దాదీని నరక చతుర్దశి/దీపావళి నాడే అంతం చేయటం యాదృచ్చికమే అయినా పచ్చి నిజం. 


1971 లో ఉత్తర బగ్దాద్‌ లోని సమర్రాలో ఇబ్రహీం అవద్ అల్-బద్రి అనబడే అబు బాకర్ అల్ బాగ్దాదీ జన్మించి - మత పెద్దగా జీవితాన్ని ఆరంభించి మౌల్వీగా కార్య కలాపాలను నిర్వహిస్తూ క్రమంగా ఉగ్రవాద భావజాలాన్ని తనలో నింపుకొని మానవ హననానికి పాల్బడుతూ వచ్చాడు. 2010లో అబు బాకర్ అల్ బాగ్దాదీ ఇరాక్‌ ఐసిస్ లో కలిసి పోయిన ఉగ్రమందల్లో ఒకటైన అల్ ఖైదాకు నాయకుడయ్యాడు. 2014లో ఇరాక్ నుంచి సిరియాకు వెళ్లిన అబు బాకర్ అల్ బాగ్దాదీ విస్తృతంగా ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టారు. 


అల్ ఖైదా స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఐసిస్ ను తెరమీదికి తీసుకొచ్చాడు. ప్రత్యర్థులను చిత్రహింసలకు గురిచేసి చంపటంలో ఐసిస్ పేరు తెచ్చు కుంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం ద్వారా ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసే ఈ నీచుని దినచర్య మహిళలపై వయసు నిమిత్తం లేకుండా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయటం వారిని చిత్రహింసలు చేస్తూ చంపేసి రాక్షసానందం పొందేవాడు. 2011 అక్టోబర్‌ లో అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా "అంతర్జాతీయ ఉగ్రవాది" గా గుర్తించింది. అబు బాకర్ అల్ బాగ్దాదీ గురించి సమాచారం ఇచ్చినవారికి 25 మిలియన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది. తాజాగా యూఎస్ బలగాలు చుట్టుముట్టడంతో అబు బాకర్ అల్ బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని కుక్కచావు చావటంతో ఆయన కథతో పాటు ఐసిస్ కథ కూడా ముగిసిట్టేనని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: