తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డికి ఉద్వాసన పలుకనున్నారా? టీ పీసీసీకి కొత్త సారథి రానున్నారా? అనే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. హూజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓటమి తర్వాత ఉత్తమ్ మార్పు చర్చానీయాంశంగా మారింది. ఉత్తమ్ ను మారిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ పటిష్ఠం కాదనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్ వ్యవహరశైలి వల్లనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలయిందని ఆరోపణలున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కనీసం ఆపలేక పోయారన్న విమర్శలు కూడా ఉత్తమ్ పై వచ్చాయి. దాని వెంటనే పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఉత్తమ్ మార్పును అధిష్ఠానం కూడా పట్టించుకోలేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పీసీసీ మార్పుపై దృష్టి పెడుతారని అంతా భావించారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలు కావడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆయన వెనక్కు తీసుకోవాలని దేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ససేమీరా అన్నారు. ఈ తతాంగం పూర్తి కావడానికే రెండు నెలలు సమయం పట్టింది. చివరకూ రాహుల్ గాంధీ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించి తిరిగి సోనియాగాంధీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ లోగా పార్లమెంటు సమావేశాలు, కేంద్ర బడ్జెట్ తదితరా సంఘటనలు వరుసగా జరిగాయి. ఇవి పూర్తి కాగానే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు దగ్గర పడడంతో పీసీసీల మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించలేదు.


ఇక ఉప ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఉత్తమ్ మార్పు ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు తెలిసింది. పైగా ఉత్తమ్ కు సపోర్ట్ చేసే వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి లాంటి నాయకులు మాత్రమే ఉత్తమ్ కు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా నేతలు ఉత్తమ్ కు ఎప్పుడు ఉద్వాసన పలుకుతారని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన సీనియర్ నాయకులను ఉత్తమ్ పక్కకు పెట్టారని విమర్శలు కూడా ఉన్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్శింహా వంటి నాయకులను అసలు పట్టించుకోవడం లేదని తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వంటి సీనియర్ నేతలను గాంధీ భవన్ లో సమావేశంలోనే ఉత్తమ్ అనుచరులతో కొట్టించారని ఆరోపణలున్నాయి. అదే విధంగా సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్కను కూడా చాలా దూరం పెట్టారని, సీనియర్ నేత జానారెడ్డి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్, సినీనటి విజయశాంతిలాంటి నాయకులను కూడా పూర్తిగా విస్మరించారని ఉత్తమ్ పై ఆరోపణలున్నాయి. కేవలం రాష్ట్ర ఇంఛార్జీ కుంతియాను మచ్చిక చేసుకొని పబ్బం గడుపుతున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.


రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ఉత్తమ్ కు సపోర్ట్ గా లేరు. కోెమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ ను తీసేస్తే తమకు పీసీసీ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. మల్కజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వనున్నట్లు రెండు నెలల క్రితం ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబం సభ్యులతో అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఫోటోలు దిగిన విషయంపై పెద్ద రాద్దాంతమే జరిగింది. కాంగ్రెస్ లో సీనియర్లందరూ ఉత్తమ్, వీ హన్మంతరావు, venkat REDDY' target='_blank' title='కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోదండరెడ్డి, తదితరలు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చారని, ఆయనకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మేస్తారని లేనిపోని అబద్దాలు చెప్పినట్లు కథనాలు వచ్చాయి. ఉత్తమ్ ను తప్పించిన తమకే ఆ పీఠం దక్కాలని కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో ఉత్తమ్ కు ఇంత కాలం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఇక ఉత్తమ్ ను ఇంకా కొనసాగిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని అధిష్ఠానం కూడా భావిస్తున్నట్లు తెలిసింది.


ఇదిలా ఉండగా ఉత్తమ్ ను పీసీసీ నుంచి తప్పిస్తే ఎవరికీ ఇవ్వాలనేది కూడా ప్రధానాంశంగా మారింది. క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ యువ నాయకత్వం రేవంత్ రెడ్డికి ఇస్తే పార్టీకి పునర్వేభవం వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను సమర్థవంతంగా రేవంత్ రెడ్డి ఒక్కరే ఎదుర్కొంటారని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు రేవంత్ కు పీసీసీ ఇవ్వడం ఇష్టం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ కు పీసీసీ ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ పెద్దలతోె వారికున్న పరిచయాలతో రేవంత్ కు రాకుండా అడ్డు తగులుతున్నారు. దీంతో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కూడా సోనియాగాంధీకి సవాలే.


రాష్ట్రంలో మరో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నది. ఒకవేళ ఈ లోగా కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తే కూడా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే హూజూర్ నగర్ ఎన్నికల్లో గెలుపుతో అధికార పార్టీ మంచి ఊపులో ఉంది. దాన్ని తట్టుకొని మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొవాలంటే కొంత కష్టమై. కొత్త అధ్యక్షుడు ఎన్నికలను ఎదుర్కొంటే వచ్చే నష్టాన్ని కూడా అతడే మోయాల్సి ఉంటుంది. ఇన్నాళ్ల పాపం కొత్త అధ్యక్షుడు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఈ పరిణాామాలను పరిశీలించి పీసీసీని మార్చాల్సి వస్తుందని తెలుస్తుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాతనే పీసీసీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తే పార్టీని పటిష్టం చేసేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: