నగరంలో పనిచేసే బ్యాచిలర్స్ గాని, చదువుకునే వారు, వీరితోపాటుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ గాని ఉండటానికి సులువుగా ఉంటుంది. వంటవార్పు ఏం చేసుకోవలసిన అవసరం లేదని హస్టల్లో ఉంటారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇకపోతే హస్టల్లో ఉండటం ఏమంత సేఫ్ కాదని మీ భద్రతకు పెను ముప్పు కలగవచ్చని, దీనివల్ల మీకు జరిగే నష్టం అంచనా వేయడం కష్టమని ఈ మధ్యకాలంలో పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే నగరంలోని హస్టళ్లు సైబర్ నేరాలకు అడ్డగా మారాయట. ఇందులో రూమ్ షేరింగ్ చేసుకునే వారుంటే మీతో ఉన్నవారు ఎలాంటి వారో తెలియకుండా మీతో ఉండనిస్తే వారు చేసే కొత్తతరహా మోసాన్ని హాస్టళ్ల జీవితాలు గడిపే వాళ్లంతా బలి అవ్వుతున్నారట. అందుకే పొరపాటున కూడా మరొకరితో రూమ్ షేర్ చేసుకోకండి.


ఒకవేళ రూమ్ షేర్ చేసుకోకతప్పకపోతే ఖచ్చితంగా మీరూ బాధితులు కావొచ్చు అంటున్నారు.ఇంతకు విషయమేంటంటే చెన్నైకి చెందిన కార్తిక్ హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మూడేళ్లుగా మాదాపూర్లోని సెరెన్ హాస్టల్ లో ఉంటున్నాడు. అది షేరింగ్ రూమ్. ఈ నెల 17న కార్తీక్ ఉంటున్న హాస్టల్ రూమ్ లో పక్కబెడ్ పై ఓ కుర్రాడు వచ్చి స్టే చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత కార్తీక్  ఫోన్‌లోని సిమ్ కార్డు పని చెయ్యలేదు. ఫోన్ తీసి చూస్తే సిమ్ కార్డ్ కరెక్టుగానే ఉంది. కానీ ఎందుకు వర్క్ చెయ్యలేదో అర్థం కాలేదు. కార్తీక్ దగ్గర మనీ వాలెట్.. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయ్.. జస్ట్ ఫోన్ పని చెయ్యలేదంతే.


వెంటనే మొబైల్ రిపేర్ షాప్­కి వెళ్లాడు.. అప్పుడు తెలిసింది అతనికి తన దగ్గరున్న ఆ సిమ్ కార్డు పనిచెయ్యని కారణంగా తాను ఏకంగా రెండు లక్షల రూపాయలు మోసపోయినట్లు.. ఇకపోతే సిమ్ కార్డుకూ పోయిన డబ్బుకీ ఏంటంటే కార్తీక్ ఫోన్‌లో సిమ్ అసలైనది కాదు. డమ్మీ సిమ్. సైబర్ కేటుగాడు హాస్టల్‌లో స్టే చేసిన రెండు రోజులు కార్తిక్‌పై నిఘా ఉంచాడు. కార్తిక్ నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాడని గమనించాడు. హాస్టల్ ఖాళీ చేసి రోజు రాత్రి.. కార్తీక్ మొబైల్‌ లోని సిమ్ దొంగలించాడు. వాలెట్‌లోని డెబిట్, క్రిడిట్ కార్డులను ఫోటో తీసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ కార్తిక్ ఫోన్‌ను నీళ్లలో పడేసి..పనిచేయకుండా చేసాడు.


కార్తిక్ సిమ్ ఉపయోగించి...నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు రోజుల్లోనే రెండు లక్షలు దోచేశాడు. ఇలాంటి నేరస్తుల వల్ల చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని సార్లు నిందితుల్ని పట్టుకుంటున్నా డబ్బు రికవరీ మాత్రం అసాధ్యంగా మారింది. అందుకే ఎప్పుడూ అలర్ట్­గా ఉండటం మన బాధ్యతనని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఈ బాధలు పడే కంటే ఓ సింగిల్ రూం తీసుకుని ఉండటం బెటర్ అంటున్నారు అధికారులు...


మరింత సమాచారం తెలుసుకోండి: