చినజీయర్ స్వామిజీకి కెసిఆర్ ప్రియ శిష్యుడు అనే విషయం అందరికి తెలిసిందే.  రాష్ట్రంలో ఏదైనా దైవికమైన కార్యం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మొదట చిన జీయర్ స్వామిజీని కలిసి సలహాలు సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా అయన నిర్ణయాలు తీసుకుంటారు.  కాగా, చిన జీయర్ స్వామి ముచ్చింతర్ లోని ఆశ్రమంలో శ్రీ తీరు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరయ్యారు.  


ఈ వేడుకల్లో కెసిఆర్ పాల్గొన్న కెసిఆర్ కొన్ని చిన జీయర్ స్వామికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు.  తన చిన్న తనంలో గ్రామంలోనే అనేక దైవికమైన కార్యక్రమాలు జరిగేవని, అందుకే తనకు చిన్న తనం నుంచి భక్తిభావం ఉందని అన్నారు.  చిన్న తనంలో గ్రామంలోకి ఎవరైన గురువులు వస్తే.. ఆ గ్రామంలోనే నెలరోజులు పాటు ఉంది గ్రామంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారని అన్నారు.  అలాంటి వారి ఉపదేశాలు విని పెరిగినట్టు కెసిఆర్ తెలిపారు.  


తనకు అంతకు ముందు ఎప్పుడు చినజీయర్ స్వామిజితో పరిచయం లేదని, జీయర్ స్వామివారు 1986-87 సంవత్సరంలో సిద్ధిపేటలో బ్రహ్మయజ్ఞం జరిపించేందుకు వచ్చారని, ఆ సమయంలో అక్కడ బ్రాహ్మణ పరిషత్ లేకపోవడంతో.. ఎక్కడ ఉండాలో తెలియలేదని, ఆ సమయంలో కొంతమంది జీయర్ స్వామిజి గారికి బస ఏర్పాటు చేయాలనీ కోరగా తన తన ఇంట్లోనే వారం రోజులపాటు ఉన్నారని కెసిఆర్ గుర్తు చేశారు.  


ఆ సమయంలో ప్రతిరోజూ జీయర్ స్వామిజిని కారులో అనేక ప్రాంతాలకు కలిసి వెళ్ళేవాడినని, ఆయనకు కారుడ్రైవర్ గా పనిచేశానని, అది తన జీవితంలో ఒక గొప్ప అనుభూతి ఇచ్చిందని అన్నారు.  జీయర్ స్వామిజి నుంచి ఎన్నో గొప్ప గొప్ప ప్రవచనాలు విన్నానని అన్నారు కెసిఆర్.  రామానుజాచార్యుల విగ్రహం హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని, ఆ విగ్రహం ఆవిష్కరణను గొప్పగా జరుపుకుందామని చెప్పారు ముఖ్యమంత్రి కెసిఆర్ 


మరింత సమాచారం తెలుసుకోండి: