మనిషికి సాహసం చేయడం అంటే మహా సరదా.  సరదా చేసే సాహసాలు అలానే ఉంటాయి.  కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తాయి.  అది వేరే విషయం అనుకోండి. ఇక దీపావళి రోజున కొంతమంది టపాసులు కాల్చే విధానం నవ్వు తెప్పిస్తుంటాయి.  దీపావళి సమయంలో కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.  గోడపై చిన్న టపాకాయి పెట్టి దాన్ని కాల్చే క్రమంలో కిందపడిపోవడం వంటిని ఫన్నీగా ఉంటాయి.  


ఇక ఇంట్లో కూర్చొని సీరియస్ గా సీరియల్ చూసుంటే.. వెనకాలే టపాయక కలిస్తే ఆ సౌండ్ కు అదిరిపడి పారిపోవడం వంటివి చాలా ఫన్నీగా ఉంటాయి.  ఇక సోషల్ మీడియాలో ఇటీవలే ఓ వీడియో ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే ఓ పెద్దాయన నోట్లో సిగరెట్  పెట్టుకొని దాన్ని వెలిగించుకున్నాడు.  అలానే మరో చేత్తో అరడజనుకు పైగా రాకెట్లను పట్టుకున్నాడు.  ఆ రేట్లకు నోట్లో ఉన్న సిగరెట్ తో వెలిగించి ఒక్కొక్కటిగా వరసగా వదిలేస్తున్నారు.  


అవి జయ్ జయ్ అంటూ గాల్లోకి దూసుకుపోతున్నాయి.  ఇది సరదాగానే ఉంటుంది.  అతనికంటే అలవాటు కాబట్టి ఆలా చేశాడు.  పెద్దలను చూసి ఇలాంటి విషయాలను పిల్లలు కూడా అనుకరిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి.  మొహం ఒళ్ళు కాలిపోవు.. అని కొందరు ఆ పెద్దాయనను తిట్టిపోస్తున్నారు.  కొందరైతే.. ఈ పెద్దాయన మామూలోడు కాదు అని అంటున్నారు.  


ఇంకొందరైతే.. ఈ పెద్దాయనను బోర్డర్ లోకి పంపిస్తే.. తక్కువ ఖర్చుతోనే పాక్ సైన్యం మీదకు ఇలా రాకెట్లు సంధించి వాళ్ళను పారిపోయే విధంగా చేస్తాడు కదా అని అంటున్నారు.  వాళ్ళ దృష్టిని మరల్చి.. వారిపై ఎటాక్ చేస్తే శత్రువులను ఈజీగా సంహరించవచ్చు కదా అని అంటున్నారు.  ఈ ఐడియా ఏదో బావుంది కదా.  ఆచరిస్తే పోలా.  దూసుకొచ్చి ఈ దీపావళి రాకెట్ల నుంచి తప్పించుకోవడం కష్టం.  తప్పించుకునే క్రమంలో అటు ఇటు పరుగులు తీస్తుంటారు.  అదే అదునుగా వాళ్ళను మట్టు పెట్టొచ్చు.  మోడీగారు ఈ పెద్దాయనపై ఓ లుక్కేయండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: