నాలుగు రోజుల క్రితం తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని నడికాడుపట్టి గ్రామంలో రెండేళ్ల సుజిత్ విన్సెన్ట్ అనే బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు.  దాదాపు 80 అడుగుల లోతులోని సుజిత్ పడిపోవడంతో వెంటనే అధికారులకు కుటుంబసభ్యులు సమాచారం అందించారు.  సుజిత్ విషయం ట్విట్టర్ లో పోస్ట్ కావడంతో.. ట్రెండ్ అయ్యింది. సుజిత్ క్షేమంగా బయటపడాలని నెటిజన్లు కోరుకున్నారు.  ట్వీట్ చేశారు.  సుజిత్ కోసం ప్రార్ధనలు చేశారు.  


రెండేళ్ల పసిబాలుడు.. 80 అడుగుల బోరుబావి.. ఆ బావికి కొంత దూరంలో సమాంతరంగా రిగ్ వేశారు.  మద్రాస్ ఐఐటి బృందం, ఎన్డీఆర్ఫ్ బృందం మూడు రోజులపాటు తీవ్రంగా శ్రమించి రిగ్ వేసింది.  అయితే, వర్షం కారణంగా, మధ్యలో రాళ్ళూ అడ్డం కారణంగా 80 అడుగుల లోతులో రిగ్ వేయడానికి మూడు రోజులు పట్టింది. అప్పటికి బాలుడికి బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ వస్తున్నారు. కానీ, మూడు రోజులు 80 అడుగుల లోతులో పడిపోవడం అంటే మాములు విషయం కాదుకదా.  


ఆహారం లేకుండా అన్ని రోజులు బ్రతికి ఉండటం సాధ్యం కాదు.  అంతేకాదు, కదలకుండా ఇరుక్కుపోయి ఉండటంతో బ్రతికే ఛాన్స్ అతి తక్కువ.  భగంతునిపై భారం వేసి ప్రయత్నం చేశారు.  ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు సుజిత్ కోసం ట్వీట్ చేశారు.  బాలుడిని రక్షించాలని, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.  సోమవారం రోజున ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అక్కడే ఉండే పనులను పర్వవేక్షించారు.  


కానీ, లాభంలేకుండా పోయింది.  రాత్రికి  సుజిత్ బయటకు తీశారు.  అప్పటికే సుజిత్ మరణించాడు.  మృతదేహం కుళ్ళిన వాసన రావడంతో హుటాహుటిన సుజిత్ హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఆ బాలుడికి దహన సంస్కారాలు చేయబోతున్నారు.  మోడీ, రాహుల్ తో పాటు దేశంలోని అనేక మంది ట్వీట్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: