మాములుగా ఒక వాచ్ ఖరీదు ఎంత ఉంటుంది చెప్పండి.. రోడ్డుమీద దొరికే వాచ్ లు 50 రూపాయల నుంచి దొరుకుతాయి.  ఖరీదైన వాచ్ అంటే దానికి అంతు ఉండదు.  ఒక సాధారణ ఉద్యోగి వాచ్ కొనాలి అంటే.. రూ. 500 లేదంటే రూ. 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు.  దాన్ని సంవత్సరం మొత్తం జాగ్రత్తగా దాచుకుంటాడు.  ఇలానే చేశాడు రోజర్ కూపర్ అనే వ్యక్తి.  అయన అయన వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు.  


ఇంగ్లాండ్ కు చెందిన కూపర్ హాంకాంగ్ లో నేవి ఉద్యోగిగా పనిచేశాడు.  ఉద్యోగం చేసే సమయంలో అతనికి వారానికి 10 పౌండ్లు మాత్రమే జీతంగా వచ్చేది.  తన 21 వ పుట్టినరో సందర్భంగా 35 పౌండ్లు పెట్టి ఒమేగా కంపెనీ తయారు చేసిన స్పీడ్ మాస్టర్ అల్ట్రా మ్యాన్ వాచ్ ను కొనుగోలు చేశారు.  తన జీతానికి అది కొనుగోలు చేయడం పెద్ద విషయం కావొచ్చు.  కానీ, నచ్చడంతో దాన్ని కొనుగోలు చేశారు.  


ఆ తరువాత, కొన్ని రోజులకు అది చెడిపోయింది.  కానీ, దాన్ని భద్రంగా అలాగే దాచుకున్నాడు.  నేవి ఉద్యోగిగా రిటైర్ అయ్యాగా సొంత దేశం ఇంగ్లాండ్ లోని హ్యాంప్ షైర్ వెళ్లి స్థిరపడ్డాడు.  అయితే,  వాచ్ కొన్న 51 ఏళ్ల తరువాత.. ఇటీవల గార్డినర్ హౌల్‌ గేట్ అనే ఆక్షన్ హౌస్ నిర్వహించిన ఆక్షన్‌ లో తన వాచ్‌ను కూడా అమ్మకానికి పెట్టడానికి రోజర్ వెళ్లాడు. అసలు ఆ వాచ్‌ కు ఏమైనా డబ్బులొస్తాయో లేదో అనే అనుమానంతోనే రోజర్ ఆక్షన్‌కు వెళ్లగా.. ఆ వాచ్‌ను చూసిన ఆక్షన్ హౌస్ ఆశ్చర్యపోయింది. 35 పౌండ్లు పెట్టి కొన్న ఆ వాచ్ ఆక్షన్‌ లో దాదాపు 40వేల పౌండ్లకు అమ్ముడుపోయింది.

అది చూసి షాక్ అయ్యాడు కూపర్.  తన కళ్ళను తానే నమ్మలేకపోయాను.  చంద్రుని మీదకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇటువంటి వాచ్‌నే ధరించి వెళ్లడంతో ఫేమస్ అయినట్టు ఆంక్షన్ యజమాని డేవిడ్ హీర్ తెలిపారు. 1968లో ఈ మోడల్ వాచ్‌ లను ఒమెగా కంపెనీ చాలా తక్కువ సంఖ్యలోనే తయారుచేసిందని, రోజర్ 1969 ఫిబ్రవరిలో ఈ వాచ్‌ ను కొనుగోలుచేశాడని డేవిడ్ పేర్కొన్నాడు. మీదగ్గర ఏమైనా పాత వస్తువులు ఉంటె మీరు కూడా మీ వస్తువులను ఆంక్షన్ కు పెట్టండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: