ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్న ఉంటుంది. కొన్ని కూపన్స్ ని ప్రకటిస్తూ  వినియోగదారులు ఆకర్షిస్తూ ఉంటుంది అమెజాన్. క్యాష్ బ్యాక్ లు  కూపన్ల పేరుతో... అమెజాన్ వెబ్ సైట్ వినియోగదారులను   ఆకర్షించి సేల్స్  పెంచుకుంటుంది. అయితే తాజాగా విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన ప్రయత్నం వికటించింది . అయితే అమెజాన్ చేసిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు... అమెజాన్ ప్రకటించిన ఆఫర్ లో  ఉచిత కొనుగోళ్లతో అమెజాన్ ను  కాళీ చేసేసారు. ఏకంగా పది రోజుల పాటు ఉచిత హంగామా కొనసాగుతుంది. కొంతమంది విద్యార్థులు అయితే తాము కొనుగోలు చేసిన వస్తువులతో ఉంటున్న ఇల్లుని  నింపేశారు.. 



 బ్రిటన్ లో  ఈ ఘటన జరిగింది. యూకే లో చదువుకుంటున్న విద్యార్థులు ఆకర్షించేందుకు అమెజాన్ వెల్కమ్5 అనే కూపన్ కోడ్ ను ప్రవేశపెట్టింది. తొలిసారి కొనుగోలు జరిపేవారు ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే వారికి 450 రూపాయల రాయితీ లభిస్తుంది. ఒకవేళ 450 రూపాయలు మొత్తం లో ఉండే వస్తువులను కొనుగోలు చేస్తే పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. కాగా ఈ కూపన్  ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని పేర్కొంది. అయితే అమెజాన్ ప్రకటించిన కూపన్ కోడ్ ఆకర్షితులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు . అయితే ఈ కోపం కోడ్ ని  మొదటిసారిగా ఉపయోగించిన విద్యార్థులు కొందరు మరోసారి కూడా ఎంటర్  చేసే ట్రై చేసారు. రెండోసారి కూడా ఈ కోడ్ పని చేసింది . ఇక ఆ తర్వాత మరో సారి ట్రై చేసి చూశారు విద్యార్థులు. ఇక ఆ నెక్స్ట్ టైం కూడా ఈ కూపన్ కోడ్  పనిచేయడంతో.... విద్యార్థులు కూపన్ కోడ్ ని బాగా యూస్ చేశారు.అయితే ఈ విషయం  క్షణాల్లో బ్రిటన్ మొత్తం పాకిపోయింది  కూడా. 



 దీంతో అందివచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోవడం ఎందుకని విద్యార్థులు అందరూ బాగానే సద్వినియోగం చేసుకున్నారు. రోజంతా తమ పనిని పక్కనపెట్టి బుకింగ్  లతో గడిపేశారు విద్యార్థులు. వస్తువులను భారీగా  ఆర్డర్ చేసారు . ఒకానొక దశలో టాప్ సెల్లింగ్ లిస్ట్ లో  టూత్ పేస్ట్ కూడా ఉండటం గమనార్హం. దాదాపు పది రోజుల పాటు ఈ కూపన్  ఆఫర్ తో  అమెజాన్ ని కాలి  చేస్తున్నప్పటికీ కూడా అమెజాన్ గుర్తించలేకపోయింది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెజాన్ చేసిన చిన్న పొరపాటు తో సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అయితే దీనిపై స్పందించిన విద్యార్థులు... అమెజాన్ లాంటి ఈ కామర్స్ దిగ్గజానికి  ఇదేమంత పెద్ద నష్టం కాబోదని అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: