ఆర్టీసీ కార్మికుల సమ్మె గత 25 రోజులుగా జరుగుతున్నది.  సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఈ సమ్మెపై ఇప్పటి వరకు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.  25 రోజులుగా చేస్తున్న సమ్మె కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  హైకోర్టు కూడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.  26 డిమాండ్లలో 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామని చెప్పి కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచింది.  కానీ, ఆ చర్చలు ఫలవంతం కాకవడంతో సమ్మెను యధావిధిగా కొనసాగిస్తున్నారు.  


సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, వారిని ఉద్యోగులుగా గుర్తించడం లేదని ప్రభుత్వం చెప్పడంతో.. ఉద్యోగం లేకుంటే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవుతుందని భావించిన చాలామంది ఉద్యోగులు భయపడుతున్నారు.  ఆ భయంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  నిన్నటి రోజున ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ కండక్టర్ నీరజ ఆత్మహత్య చేసుకుంది.  ఆత్మహత్య చేసుకోవడంతో నిన్నటి రోజున ఖమ్మంలో కార్మికులు భగ్గుమన్నారు.  ఖమ్మం జిల్లలో బస్సులు బయటకు రానివ్వలేదు. 


దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు.  నిన్న మరణించిన కండక్టర్ నీరజకు ఆర్టీసీ జేఏసీ నివాళులు అర్పించింది.  అదే విధంగా జేఏసీ నేతలు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.  మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.  అదే విధంగా ఈరోజు హైకోర్టులో  చెప్పవలసిన విషయాలను కూడా ప్రిపేర్ చేస్తున్నారు.  దీంతో పాటు రేపు సకలజనుల సమరభేరి సభను ఏర్పాటు చేస్తున్నారు.  


ఈ సభకు అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.  అన్ని పార్టీలు ఈ సభలో పాల్గొన బోతున్నాయి.  పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతున్నది.  కనీసం నాలుగు లక్షలమంది ఈ సభకు హాజరు కానున్నట్టు సమాచారం.  ఈ సభ విజయవంతమైతే ప్రభుత్వానికి ఇది ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంటుంది.  మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అన్నది చూడాలి.  ఈరోజు మధ్యాహ్నం సమయంలో హైకోర్టు ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణను చేపట్టబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: