ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రని అభివృద్ధి వైపు నడిచేలా చూస్తున సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 5 నెలల పాలనలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలానే ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. 

                                           

ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అధికారుల్ని హెచ్చరిస్తూ.. అధికారుల తప్పుంటే వెంటనే చర్యలు తీసుకుంటూన్నారు. అయితే ఈరోజు కూడా మరికాసేపట్లో స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ మీడియా కానిఫరెన్స్ నిర్వహించనున్నారు. కాగా మధ్యాహ్నం విద్యాసంస్కరణల కమిటీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 

                                               

మరి ఇక్కడ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అనేది తెలియాల్సి ఉంది. సీఎం జగన్ ఈ స్పందన కార్యక్రమం పట్ల ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వాహించారు. అయితే గతంలో జరిగిన సమీక్షలో స్పందన దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది అని, సమస్యల పరిష్కారంపై అంకిత భావం చూపుతున్నారని, అందుకే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు.  మరి ఇప్పుడు సమీక్షలో ఎం జరుగుతుంది ? ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: