జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు, పిన్నెల్లి, పొరుగుపాడు, జంగమేశ్వరపురం గ్రామాల్లో బాధితులను కలవనుంది. హక్కుల సంఘం పర్యటనలో ప్రధాన ఉద్దేశ్యమేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటమే.

 

ఎందుకంటే వైసిపి ప్రభుత్వంపై టిడిపి ఎంపిలు ఫిర్యాదు చేయటం ద్వారా హక్కుల సంఘంలోని సభ్యులను రాష్ట్రంలో  పర్యటనకు వచ్చేట్లు టిడిపినే స్కెచ్ గీసింది. ఈ విషయాన్ని నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబే స్పష్టంగా చెప్పారు. అయితే క్షేత్రస్ధాయిలో పర్యటిస్తున్న హక్కుల సంఘం సభ్యులు చివరకు చంద్రబాబుకే రివర్స్ షాక్ ఇచ్చే పరిస్ధితులు ఉన్నాయని సమాచారం.

 

ఎలాగంటే అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల ఆత్మహత్యపై కమిషన్ సభ్యులు విచారణ జరుపుతారట. వైసిపి ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి ఆరోపణలు చేస్తోంది. నిజానికి కోడెల ఆత్మహత్య చేసుకోవటానికి కారణం చంద్రబాబే అన్న విషయం టిడిపి నేతలకు కూడా బాగా తెలుసు. కానీ చంద్రబాబు చెప్పినట్లు వినాలి కాబట్టి టిడిపి నేతలు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు.

 

సరే విచారణ అంటూ మొదలైన తర్వాత కోడెల,  యరపతినేని, జివి ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు తదితరుల బాధితులు కూడా తెరపైకి వస్తారు కదా ? టిడిపి హయాంలో వేధింపులకు గురైన వందలాదిమంది బాధితులు కమీషన్ ముందు నిలబడటం ఖాయం.  ఇక కోడెల ఫర్నీచర్ దొంగతనంతో పాటు కొడుకు, కూతురు అరాచకాలు అన్నీ తెరపైకి వస్తాయి. అపుడు కోడెల దొంగతనం వ్యవహారం జాతీయ స్ధాయిలో హైలైట్ అవ్వటమే కాకుండా చంద్రబాబు పరువే కృష్ణానదిలో కలుస్తుంది.

 

అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల దొంగతనం చేసిన విషయం వాస్తవం. అలాగే కోడెల కుటుంబ సభ్యుల వేధింపులు కూడా వాస్తవమే. కాబట్టి వైసిపి ప్రభుత్వాన్నో లేకపోతే జగన్నో  గబ్బుపట్టిద్దామని చంద్రబాబు వేసిన ప్లాన్ చివరకు చంద్రబాబుకే రివర్సవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. మొత్తం మీద జగన్ మీద ఫిర్యాదులు చేయటం ద్వారా చంద్రబాబు తన పరువును తానే తీసేసుకుంటున్నారు మరోసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: