ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన చికిత్స పొందుతూ ఫలితం లేకుండా పోయింది . ఈ నేపథ్యంలో కోడేలా మృతిపై చాలా అనుమానాలు రేకెత్తాయి. అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మృతికి వైసీపీ ప్రభుత్వం వేధింపులే కారణమని... వైసీపీ ప్రభుత్వం మాజీ స్పీకర్ పై అక్రమ కేసులు బనాయించడం వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి పార్టీ మనవ  కమిషన్ కు  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు పల్నాడు ఆత్మకూరు ప్రాంతాల్లో టిడిపి నేతలపై వైసీపీ నేతలు దాడులు జరుపుతున్నారని ఈ నేపథ్యంలో టిడిపి శ్రేణులకు రక్షణ కరువైందని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది టిడిపి. 



 ఈ నేపథ్యంలో నేడు గుంటూరు జిల్లాలో జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన చేయనుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మానవ హక్కుల కమిషన్ ఆత్మకూరు జంగమహేశ్వరపురం పిన్నెల్లి పొరుగుపాడు గ్రామాలను సందర్శింనుంది. అయితే టిడిపి చేసిన ఫిర్యాదు మేరకు మాజీ స్పీకర్ కోడెల మృతిపై విచారించనుంది మానవ హక్కుల కమిషన్. కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మానవ హక్కుల కమిషన్ పర్యటన ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. మాజీ స్పీకర్ కోడెల మృతికి  అసలు కారణాలేంటి టిడిపి ఫిర్యాదులో పేర్కొన్న విధంగా నిజంగానే వైసీపీ ప్రభుత్వం పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిందా అనే  కోణంలో విచారణ జరపనుంది మానవ హక్కుల కమిషన్. 



 అంతేకాకుండా టిడిపి శ్రేణులపై  వైసిపి దాడులకు పాల్పడుతుంది అనే  ఫిర్యాదు లో భాగంగా ఆత్మకూరు జంగమహేశ్వరపురం పిన్నెల్లి పొరుగుపాడు గ్రామాలను సందర్శించి... అక్కడ పరిస్థితులు సహా  వైసీపీ నేతలు  టీడీపీ శ్రేణుల పై దాడులు,  వేధింపులకు సంబందించి  జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరపనుంది. అంతే కాకుండా పొరుగుపాడులో  రోడ్డుకి అడ్డంగా  వైసీపీ నేతలు నిర్మించిన గోడను తొలగించనున్నారు . అయితే ఈ గోడను తొలగించేందుకు అసెంబ్లీలో కూడా చర్చ జరగగా నెల రోజుల్లో  ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై విచారణ జరపనుంది. అంతేకాకుండా టిడిపి శ్రేణులపై  పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు... వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడడం ... సహా రక్షణ చర్యలు ఇలాంటి పలు అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటనలో విచారణ జరపనుంది. కాగా 4 రోజులు పాటు సందర్శించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: