హైదరాబాదుని యూనియన్ టెరిటరి చేయాలి అనే ప్రస్తావన రావడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇంతకు మునుపు కూడా ఇలాంటి పుకార్లు షికారు చేయడం మనం వింటూనే ఉన్నాము. ఆ ఇది ప్రతీ పుష్కరానికి ఒక సారి ఎన్నికల సమయంలో అంటునే ఉంటారు కదా అని కొట్టి పారేయడానికి లేదు. ఈసారి విషయం చాలా ఘంభీరమైనది అని గట్టి విస్వశనీయ సమాచారం వస్తోంది అని, ఇక టీఆర్ఎస్ పని అయిపోయినట్టే అని ప్రతిపక్షాలు చెవులు కొరుక్కుంటున్నారు అట.

 

 

మరీ ముఖ్యంగా హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాల కంగారు మరింతగా పెరిగింది అని, ఇక టీఆర్ఎస్‌ను దెబ్బతీయాలి అంటే హైదరాబాదుని లక్ష్యంగా మార్చుకోవాలి అని ఆలోచించి ఈ పన్నాగం వేస్తున్నారు అని సమాచారం. 

 

 

దాదాపుగా 80% ఆర్థిక బలం హైదరాబాదు నుండే తెలంగాణకు వస్తుంది. అందు వలన, హైదరాబాద్‌ని టెలంగాణ నుండి విడదీస్తే, ఇక టీఅర్ఎస్ బలం మిగతా రాష్ట్రం లో తగ్గుతుంది అన్నద ఒక భావన. అంతే కాకుండా, హైదరాబాదు నగరంలో ఎంఐఎం పట్టు వీడాలి అన్నా కూడా కేద్ర పాలిత సెక్యూరిటీ ఉండటం అనేది చాలా ముఖ్యం అని బీజేపీ భావిస్తోంది. 

 

 

హైదరాబాదులో హిందూ ముస్లిం సెంటిమెంట్ ఉండటం, అందులోనూ టెర్రరిజానికి కేంద్రంగా స్లీపర్ సెల్స్ బాగా ఎక్కువగా ఉండే ప్రాంతం అవ్వడంతో, ఉత్తరాన కష్మీర్ మరియూ ఢిల్లీ ఎంత ముఖ్యమో, ఇక దక్షిణాన హైదరాబాదు కూడా అంతే ముఖ్యం అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అట. కాబట్టి, ఒకే దెబ్బకి రెండు పిట్టలను కొట్టాలి అనే బీజేపీ ప్రయత్నానికి పెద్దగా అడ్డు ఉండబోదు అనే అనుకోవాలి. నిజంగా ఇది పుకారు కాకపోతే, ఇది త్వరలోనే వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకోవచ్చు. ఇందుకు కారణం, బీజేపీ కేంద్రంలో లోక్‌సభ లోనే కాకుండా రాజ్యసభ లోనూ ఆధిక్యం సంపాదించుకోవడం.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: