తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్లను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బస్సులను తాత్కాలిక ఉద్యోగులు నడుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బస్సులను నడిపే డ్రైవర్లు తెచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే వారు తెలంగాణ ఆర్టీసీకి చేస్తున్న నష్టం మాత్రం  పెద్ద మొత్తంలో ఉంది. సరిగ్గా డ్రైవింగ్ చేయలేక వీరు రోడ్లపై భీభత్సవాన్ని సృష్టిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లు చేసే ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.


ఈ పరిస్దితి తెలంగాణాలోని ప్రతి నగరంలో ఉంది. ఒకరకంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె వల్ల ఉద్యోగుల ప్రాణాలు పోవడమే కాకుండా ప్రయాణం చేద్దామని ఇంట్లోనుండి సంతోషంగా బయటకు వెళ్లిన ప్రజలు కూడా తిరిగి తమ ఇంటికి చేరుకుంటారో లేదో అనేలా ఇప్పటి బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి. అసలు ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్దితిలో ఎక్కడికైన తప్పని సరి పరిస్దితిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించే పరిస్దితులు తెలంగాణాలో ఇప్పుడు తలెత్తాయి.


ఈ బస్సు ప్రమాదాలు రోజు రోజుకు ఎక్కువ మొత్తంలో జరుగుతూ ప్రయాణం అంటేనే దడ పుట్టిస్తున్నాయి. ఇటువంటి పరిస్దితులో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎక్కడంటే నల్గొండలో జరిగిన ఈ ఘటనలో తాత్కాలిక డ్రైవర్ నడిపిస్తున్న బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయట పడ్డారు. అదృష్టం బాగుంది కాబట్టే ఎవరికి ప్రాణహాని జరుగలేదు.


లేకుంటే జరగరానిది జరిగి ఉంటే ఆ నష్టానికి బాధ్యత ఎవరు వహించేవారు. ఇకపోతే ఇప్పటికైన ప్రభుత్వం సరైన నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ విషయంలో తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఇంకెంత కాలం ఇలా కాలయాపన చేస్తూ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: