మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం దేశంలో ఉత్కంఠను రేపుతున్నాయి. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో శివసేన వైఖరితో బీజేపీకి ఇబ్బందులు తలెత్తాయి. గత ఎన్నికల్లో 122 ఉన్న బీజేపీ బలం ఈసారి ఎన్నికల్లో 105కి తగ్గిపోయింది. దీంతో శివసేన సీఎం పీఠంపై కన్నేసింది. సీఎం పదవి చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన డిమాండ్ తో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది.

 


ఈ ఒప్పందానికి ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే మంత్రి పదవుల్లో శివసేనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కానీ సీఎం పదవిని ఎట్టి పరిస్థితుల్లోనే షేర్ చేసేది లేదని బీజేపీ అభిమతంగా తెలుస్తోంది. దీంతో స్వతంత్ర ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు ఎన్సీపీ కి చెందిన ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా శూలే కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ అడిగారనే వార్త సెన్సేషన్ గా మారింది. దీంతో శివసేనకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అడుగులు వేస్తోందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. శివసేనకు, ఎన్సీపీకి చెరో 50కి పైగా సీట్లున్నాయి. దీంతో ఎన్సీపీని కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా బీజేపే చేస్తోందని వార్తలు వస్తున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందంటున్నారు.

 


మరోవైపు.. గతంలో బీజేపీ ఇచ్చిన ‘చెరిసగం’ అనే మాటకు కట్టుబడాలని శివసేన అంటోంది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎంను చేయాలనేది శివసేన ప్లాన్. ‘మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటాం’ అంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయ అమిత్ షాను కలిసేందుకు చూస్తూండడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: