సాధారణంగా చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. చేపలు నదులు, సముద్రాలు, సరస్సులలో పెరుగుతాయి కాబట్టి అవి సహజమైన వాటినే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి వాటిని తిన్నా కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మటన్ చికెన్ తినడం కంటే చేపలు బెటర్ అని చాలా మంది అభిప్రాయం. అందుకని ఈ మధ్య నాన్ వెజ్ ఇష్టపడే నగర ప్రజలు చేపలు తినడానికే ఎక్కువ ఇష్టం చూపుతున్నారు.


అయితే కొందరు వ్యాపారులు ఈ ఇష్టాన్ని తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. వీరు చేపలు పెంచే విధానం తెలిస్తే ఇంకోసారి చేప ముట్టుకోవాలంటేనే భయపడతారు. చేపల చెరువులు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. ఆ తర్వాత ఎంచక్కా వాటిని నగరంలోకి తీసుకువచ్చి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ చేపలకి ఇచ్చే దాణానే సమస్యగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందీ దందా.


ఈ చేపల చెరువుల్లో పెంచే చేపలకు వ్యాపారులు చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ వేసి పెంచుతున్నారు. కోడి  పేగులు, మరియు మటన్ లో పనికిరాని పదార్థాలని ఉడకబెట్టి చేపలకి ఆహారంగా వేస్తున్నారు. వీటిని చేపలు తింటున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వ్యాపారులు ఇదే రకంగా ఉన్నారు. ఇలాంటి ఆహారం తిన్న చేపలను తినడం సరికాదని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.



వ్యాపారులు తమ స్వంత లాభార్జన కోసం వినియోగదారులని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. అయితే వ్యాపారులు ఇలా చేయడంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే, కొందరు వ్యాపారులు ధైర్యంగా అవును చికెన్ వేస్ట్ పెడుతున్నాం  ఏం చేస్తారని అంటున్నారట. ఇంకొందరు అసలలాంటి ఆహారం అందించట్లేదని అబద్ధాలు చెబుతున్నారట. మరి ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: