ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారు . ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆటో ట్యాక్సీ డ్రైవర్ లకు వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్  31 చివరి  తేదీ. అంటే మరో  రెండు రోజుల్లో గడువు ముగియ బోతుంది. అయితే ఈ పథకానికి దరకాస్తు  గడువు గతంలోనే ముగిసినప్పటికీ... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో  దరఖాస్తు గడువు పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

 

 

 

 ఈ పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని  వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జగన్ . దీనికోసం ఆటో క్యాబ్  డ్రైవర్లకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల  31 వరకు దరఖాస్తు  గడువు పొడగించారు. 31లోపు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి  10 వేల  రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది . అయితే వైయస్సార్ వాహన మిత్ర పథకం లో భాగంగా అర్హులందరికీ ప్రతి ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. అయితే ఈ పథకానికి పొందడానికి కొన్ని విధివిధానాలు రూపొందించింది ఏపీ ప్రభుత్వం.

 

 

 

 ఆటో రిక్షా,  టాక్సి, మ్యాక్సీ క్యాబ్ వీటిలో ఏదైనా సొంత వాహనం ఉండాలని... ఓనర్ మాత్రమే డ్రైవర్ గా  ఉండాలని... ఆ వాహనానికి ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని  ప్రభుత్వ నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టిన ప్రభుత్వం... దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు తెల్లరేషన్ కార్డు ఉన్న వారే ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఒక వ్యక్తి ఒక వాహనాన్ని మాత్రమే ఆర్థిక సహాయాన్ని పొందేలా  ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఒక వ్యక్తికి రెండు ఆటోలు ఉన్న లేదా ఒకే ఇంట్లో ఇద్దరు పేరుమీద రెండు ఆటోలు ఉన్నప్పటికీ ఆర్థిక సహాయం మాత్రం ఒకటే అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: