ఉద్యోగులను ఆఫీస్ లకు రావొద్దు ఇంట్లోనే ఉండండి.. నెల కాగానే జీతాలు అకౌంట్ లో వేస్తాం అంటే ఎవరైనా సరే ఏం చేస్తారు.. అబ్బా ఎంత హాయి.. ఇలాంటి అఫర్ ఉంటె ఎంత బాగుంటుంది అని  సంబరపడిపోతుంటారు.  ఎవరూ కూడా ఇలా చేయరు.  ఆఫీస్ కు రావొద్దు అన్నారు అంటే దానికి కారణాలు చాలా ఉండి ఉంటాయి.  అలాంటి కారణలో ఒకటి ఆఫీస్ లో ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు.. లేదంటే అతని ఉద్యోగం పోయి ఉండొచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కావొచ్చు.  


చెప్పిన రెండు కారణాలు ఏమోగానీ.. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసి కార్యాలయం మూడో కారణాన్ని చూపించి ఉద్యోగులను ఆఫీస్ కు రాబొద్దని చెప్తోంది.  మూడో కారణం ఏంటి.. ఏదైనా కారణం కావొచ్చు కదా.. అక్కడ కారణం ఏంటో చెప్పలేదు కదా అనే డౌట్ రావొచ్చు.  అక్కడికే వస్తున్నా.. ఇటీవల కాలంలో కేంద్రం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ వాహనచట్టం ప్రకారం హెల్మెట్ లేకుంటే వెయ్యి రూపాయల వర్కౌ ఫైన్ వేస్తున్నారు.  


పైగా పెట్టుకోకుండా వెళ్తూ.. ఏదైనా ప్రమాదం జరిగితే.. దాని వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలిసిందే కదా.  అందుకే హెల్మెట్ పెట్టుకోవాలని లేదంటే ఫైన్ పడుతుందని ఇప్పటికే చెప్పింది.  దీన్ని చాలా మంది వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.  వ్యతిరేకించినా ప్రజల రక్షణ ముఖ్యం కాబట్టి తప్పదని ప్రభుత్వం చెప్తోంది.  కాగా, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న జీహెచ్ఎంసి కార్యాలయం ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.  


హెల్మెట్ పెట్టుకోకుండా ఆఫీస్ కు రావొద్దని, హెల్మెట్ ఉంటేనే ఆఫీస్ కు రావాలని సూచించింది.  దీనికి సంబంధించిన బ్యానర్ ను ఆఫీస్ గేటు ముందు పెట్టింది.  ఇప్పుడు ఈ బ్యానర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.  ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు ఇలానే చేస్తే.. ప్రతి ఒక్కరు ఆఫీస్ కు విధిగా హెల్మెట్ పెట్టుకొని వస్తారు.  తద్వారా ప్రమాదాలను వీలైనంతగా నివారించవచ్చు.  మరి కార్యాలయాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: