ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ఇసుక కొరత భారీగా ఏర్పడింది. ఇసుక కొరతతో  రాష్ట్రం మొత్తం కొట్టుమిట్టాడుతోంది. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా ఇసుక కొరతతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కరువై భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే రాష్ట్రంలో భారీగా ఇసుక కొరత ఏర్పడడంతో అదే అదనుగా భావించిన వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇసుక దొరక్క ప్రజలు అల్లాడుతూ భవన నిర్మాణం చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత అంశంపై ప్రతిపక్ష టిడిపి... అధికార వైసీపీలు ఒకరి పై ఒకరు  విమర్శలు ప్రతి విమర్శలు కూడా దిగుతున్నాయి. ఈ క్రమంలో ఇసుక కు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ని  అనుకూలంగా మార్చుకుంటూ పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ ... దర్జాగా దందా కొనసాగిస్తున్నారు ఇసుక మాఫియా. 

 

 

 

తాజాగా గాజువాక ఆటో నగర్ లో ఇసుక మాఫియా ఎక్కువైపోయిందని సమాచారం . రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కువగా ఏర్పడడంతో ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడింది. గోదావరి కృష్ణా పెన్నా నదుల్లో  వరదలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇసుక తియలేని పరిస్థితి ఏర్పడడంతో ఈ డిమాండ్ ఇంకాస్త ఎక్కువ అయింది. దీంతో ఒక్క లారీ ఇసుకకు  80 వేల రూపాయల  వరకు అమ్ముతున్నారట ఇసుకాసురులు. రోజుకు పది నుంచి పదిహేను లారీల వరకు ఒడిస్సా సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని సమాచారం. దీంతో దిగుమతి చేసుకున్న ఇసుక లారీ కి  80 వేల వరకు అమ్ముతూ  భారీగా డబ్బులు దండుకుంటున్నారట  కొందరు వ్యక్తులు. 

 

 

 

 అయితే ఇసుక మాఫియా గురించి అధికారులకు తెలిసినప్పటికీ కూడా అధికారులు ఏమీ తెలియనట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని ఈ అక్రమ ఇసుక దందాను ఆపాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేక వాళ్ళ  కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా గోదావరి కృష్ణా పెన్నా నదులకు వరదలు ఎక్కువవడంతో ఇసుక తీసే  పరిస్థితి లేదని ... వరదలు తగ్గాక పారదర్శకంగా ఇసుకను పంపిణీ చేస్తామని అధికారులు మంత్రులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: