ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక కొర‌త చాలా స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతోంది. సుమారుగా 30 ల‌క్ష‌ల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అనుబంధ రంగాల‌కు చెందిన కార్మికుల‌కు కూడా పనులు తగ్గడంతో కూలీ దొరకట్లేదని చెబుతున్నారు.


ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన న‌లుగురు భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌కీయంగా దుమారచెల‌రేగుతోందికానీ పోలీసుల వాద‌న మాత్రం భిన్నంగా ఉంది. కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు చాలా కార‌ణాలున్నాయ‌ని వారు చెబుతున్నారు. గుంటూరు రూరల్ మండ‌లం గోరంట్ల‌కు చెందిన పోలేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర రావు ఆత్మ‌హ‌త్య‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సంచ‌ల‌నంగా మారింది.


అక్టోబ‌ర్ 2వ తేదీన వెంక‌టేశ్వ‌ర రావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అత‌నికి భార్య రాశి, ఏడాది వ‌య‌సు ఉన్న ఛాయా చర‌ణ్ అనే కుమారుడు ఉన్నారు."ప‌రిస్థితులు బాగోలేక ప‌నుల్లేవు. సంపాద‌న లేదు. పెళ్లాం, బిడ్డ‌ల‌ను బ‌తికించుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నా. అంద‌రూ అడుగుతున్నారు.. ఏం చేస్తావ‌ని..పైపుల ప‌నిచేస్తాన‌ని గొప్ప‌గా చెప్పుకుంటున్నాను. ప‌నులున్నాయా అని అడుగుతున్నారు. ఉన్నాయ‌ని చెబుతున్నాను. కానీ వాస్త‌వానికి ప‌నుల్లేవు. దాంతో ప‌నుల్లేవ‌నే అసహనాన్ని నా భార్య మీద‌, నా బిడ్డ మీద చూపించాల్సి వ‌స్తోంది. న‌న్ను న‌మ్మి వ‌చ్చిన వాళ్ల‌ని మోసం చేయ‌లేను. చేత‌గాని వాడిలా చ‌చ్చిపోతున్నా.. " అంటూ సెల్ఫీ వీడియోలో వెంకటేశ్వరరావు మాట్లాడిన కొంత భాగం వైర‌ల్ అవుతోంది.


త‌మ బిడ్డ ఆరోగ్యం బాగోలేక ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతుండ‌గా, ప‌నులు లేక‌పోవ‌డంతో మ‌రిన్ని క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని సెల్ఫీ తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న వెంక‌టేశ్వ రావు భార్య "బాబుకి ఆరోగ్యం బాగోలేదు. ఏడాది నుంచి చాలా ఆస్ప‌త్రులు తిప్పాం. ఆప‌రేష‌న్ చేయాల‌న్నారు. ఖ‌ర్చులు రూ.50వేలు అవుతుంద‌ని చెప్పారు. మా ద‌గ్గ‌ర అంత లేవు. ఇసుక లేక‌పోవ‌డంతో ప‌నుల్లేవు. పనుల్లేక మమ్మల్ని పోషించ‌లేని ప‌రిస్థితి ఎదుర్కొన్నారు. అటు ఆప‌రేష‌న్ కోసం ఖ‌ర్చులు, ఇటు ఇంట్లో పోష‌ణ కోసం ఖ‌ర్చుల కోసం చాలా త‌ప‌న ప‌డ్డారు. చివ‌ర‌కు మ‌న‌సు స్థిరంగా లేక‌పోవ‌డంతో ఈ బాధ‌ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క మేము ఇంట్లో లేన‌ప్పుడు ఇలా చేసుకున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: