తాజాగా గన్నవరం నియోజకవర్గంలో జరిగే పరిణామాలు ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం గన్నవరం ఎమ్యెల్యే టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకోవడమే. అయితే వంశీని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్ ను అదే పార్టీ కి చెందిన గన్నవరం ఇన్ ఛార్జ్ వ్యతిరేకిస్తున్నాడు. 

గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ తమ పార్టీలోకి వంశీ చేరడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఏడాది 4 వేల మంది వైసీపీ కార్యకర్తల పై కేసులు పెట్టించాడని, తమను మానసికంగా వల్లభనేని బాధ కలిగించాడని యార్లగడ్డ వాపోయారు. అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారాని మండిపడుతూ జగన్ పై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు. ఒకవేళ తనను పార్టీలోకి చేర్చుకుంటే పార్టీ క్యాడర్ లో కలహాలు వస్తాయి అన్నారు. 

అయితే ఇంతకు ముందు జగన్ పెట్టిన నిబంధన ప్రకారం ఏ ఇతర పార్టీ నుంచి అయినా నాయకులు తమ పార్టీలో చేరాలి అంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన మాటను వంశీ పాటించాడు. దీంతో వంశీ మీద ఓడిపోయిన వెంకట్రావ్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ కార్యకర్తలతో జగన్ ని కలిసి వంశీ ని పార్టీలోకి చేర్చుకోవద్దని అదిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే ముందు జరగబోయే కార్యాచరణ పై కుడా చర్చలు జరుపుతున్నారట. 

వంశీ ని పార్టీలో తీసుకోవద్దు అంటూ జగన్ తో యార్లగడ్డ పెద్ద ఎత్తున్న మంతనాలు జరుపుతున్నారు అని తెలుస్తోంది. అలాగే మరో వైపు వంశీ కూడా తమ కార్యకర్తలతో విడిగా జగన్ తో చర్చలు జరుపుతున్నారట. అయితే జగన్ మాత్రం వంశీని చేర్చుకొని రాజ్యసభ సీటు కట్టపెట్టేందుకు సన్నహాలు చేస్తున్నారు అని సమాచారం. ఈ మేరకు జరిగిన పరిణామాల అనుగుణంగా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి..! 


మరింత సమాచారం తెలుసుకోండి: