తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు  చేపడుతున్న సమ్మె 25 రోజులకు చేరుకుంది. అయితే ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం దిశగా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగానే ఎక్కువ మొగ్గు చూపుతుంది.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ప్రజల అవసరాలు తీర్చేందుకు అద్దె  ప్రైవేటు బస్సులను నడుపుతుంది  ప్రభుత్వం. ఇక ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ బస్సులు  నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను విధుల్లోకి తీసుకుని బస్సులు నడువుతున్నారు . అయితే ప్రభుత్వం అద్దె  ప్రైవేటు బస్సులు రాష్ట్ర ప్రజల  పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాయి . అంతేకాకుండా ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు ప్రజల ప్రాణాలను  ప్రమాదంలోకి నెట్టుతున్నారు . 

 

 

 

 అనుభవం లేని వారిని తాత్కాలిక డ్రైవర్లుగా  విధుల్లోకి తీసుకోవటంతో  ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి . కొంతమంది తాత్కాలిక డ్రైవర్లు  మద్యం సేవించి మరి బస్సులను నడుపుతున్నారు. దీంతో తాత్కాలిక డ్రైవర్ల  నిర్లక్ష్యంతో రోజురోజుకు బస్సు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొంతమంది మద్యం సేవించి వాహనాలు నడిపితే...  ఇంకొంతమంది హై స్పీడ్  తో వాహనం నడుపుతున్నారు .దింతో  బస్సు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ఆర్టిసి తిప్పుతున్న బస్సులు  ఎక్కాలంటేనే  జంకుతున్నారు. 

 

 

 

 ఇప్పటికే కూకట్ పల్లి లో ఒక బస్సును మరో బస్సు వెనకనుండి ఢీ కొట్టడంతో  ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక బోరబండలో రోడ్డు పక్కన నడుస్తున్న వ్యక్తిని బస్సు ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.ఇక ఇప్పుడు తాజాగా  ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్ లో ఓ బార్లో కి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనతో  అందరూ భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టు వదలకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు .

మరింత సమాచారం తెలుసుకోండి: