రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అని స్పష్టంగా చెప్పడం చాలా కష్టం.  ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు.  ఎప్పుడు ఎలా మారుతుందో .. ఎవరు అధికారంలో ఉంటారో.. ఎవరు దిగిపోతారో చెప్పడం కష్టం.  ఇక నేతలు పార్టీలు మారడం అంటే గుడ్డలు మార్చుకున్నంత ఈజీగా పార్టీలు మారిపోతుంటారు. పార్టీలు మారే నేతల గురించి ఎందరో వివిధ రకాల కార్టూన్లతో ఆకట్టుకున్నారు.  


ఇక అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజలను ఆకర్షించేందుకు చేసే పనులు అన్నిఇన్ని కావు.  అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు.  రాష్ట్రం ఆదాయం, అభివృద్ధి, అప్పులను పట్టించుకోకుండా హామీలు ఇచ్చేస్తుంటారు.  ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.  ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే విమర్శలు.. ప్రతిపక్షాల నుంచి వచ్చే దెప్పిపొడుపులు అన్నింటిని ఎదుర్కోవాలి.  అలా ఎదుర్కోకపోతే.. రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టం కదా.  


అయితే, ఇక ఎన్నికలకు ముందు ప్రచారం చేసే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.  చీపురు పట్టుకొని ఇంటి ముందు ఊడడం దగ్గరి నుంచి అన్ని రకాల పనులు చేస్తుంటారు. ఇదిలా ఉంటె, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగల్ ఇటీవలే రాయ్ పూర్ లోని ఓ మందిరాన్ని సందర్శించారు.  అక్కడ మందిరంలో సందర్శనం భలే విచిత్రంగా ఉంటుంది.  అక్కడ పూజారి వచ్చిన భక్తులను కొరడాతో కొడతారు.  


ఈ సంప్రదాయాన్ని ముఖ్యమంత్రిపై కూడా ప్రయోగించారు.  భూపేష్ చేయి చాచగా..పూజారి కొరడాతో అయన చేతిపై కొట్టాడు. అలా ఆరు కొరడా దెబ్బలు తిన్న తరువాత భూపేష్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. పాపం కొరడా దెబ్బలకు ముఖ్యమంత్రిగారి చేయి కమిలిపోయింది.  అనంతరం ఆలయ పూజారి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రికి తీర్ధప్రసాదాలు ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: