ఆర్టీసీ సమ్మె కాస్త క్రమంగా ఉద్యమం దిశగా మారుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. సమ్మె కార్మికుల హక్కు అని.. సమ్మెద్వారా డిమాండ్లను సాధించుకోవడం అవసరం అని, డిమాండ్ల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని కార్మిక సంఘాలు తెగేసి చెప్పాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతున్నారు.  అందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ససేమిరా అంటోంది.  అంతేకాదు, కార్మికులు సమ్మెకు దిగి సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రభుత్వం చెప్పడంతో కార్మికు సమ్మెను మరింత ఉదృతం చేశారు. 


గత 25 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  రోజువారీ పనుల కోసం బయటకు వెళ్ళాలి అంటే బస్సులు ఉండాలి.  బస్సులు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసినా.. సరిపోవడం లేదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా ప్రైవేట్ వ్యక్తులను తీసుకుంది.  ఆర్టీసీ బస్సుల కండిషన్ ఎలా ఉన్నదో చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.  


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ సాగుతున్నది.  హైకోర్టు ఈ సమ్మె విషయంపై అనేక ప్రశ్నలు సంధించింది.  ప్రభుత్వంలో విలీనం చేయడం పక్కన పెట్టి ముందు కార్మికులు ఇచ్చిన 26 డిమాండ్లలో ఎన్ని పరిష్కారం చెయ్యొచ్చో వారితో చర్చలు జరిపి ముందు వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయగా.. అందులో రెండు మాత్రమే సాధ్యం అని చెప్పడంతో కోర్టు షాక్ అయ్యింది.  నాలుగు డిమాండ్లు కూడా పరిష్కరించలేరా అని ప్రశ్నించింది.  ఇక నాలుగు డిమాండ్లకు రూ.  50 కోట్లు ఖర్చు అవుతుందని అవి ఇవ్వొచ్చు కూడా అంటే.. ప్రభుత్వం దగ్గర డబ్బులేదని చెప్పడంతో హైకోర్ట్ షాక్ అయ్యింది.  


ఆర్టీసీకి రూ. 47 కోట్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం హుజూర్ నగర్ కు రూ. 100 కోట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించింది.  దీంతో ప్రభుత్వం షాక్ అయ్యింది.  ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ. 1099 కోట్లు ఉన్నాయని వాటిని ఆర్టీసీకి ఎందుకు చెల్లించలేదని అడిగితె.. తెలంగాణ 48శాతం, ఏపీ 52శాతం చెల్లించాలని ప్రభుత్వం చెప్పింది.  ఆర్టీసీని ఆస్తులను ఎందుకు డివైడ్ చేయలేదని ప్రశ్నించగా.. అది కేంద్రం పరిధిలో ఉందని చెప్పింది.  ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 4,235కోట్లు ఇచ్చినట్టు చెప్పింది ప్రభుత్వం.  కేవలం రూ. 850 కోట్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ ఉందని.. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రేపు జరిగే సకలజనుల సమరభేరి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించగా సరూర్ నగర్ లో సకలజనుల సమరభేరి సభను జరుపుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.  అయితే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే సభను నిర్వహించాలని షరతులు విధించింది.  చూస్తుంటే.. ఆర్టీసీ సమ్మె ప్రభావం కారణంగా ప్రభుత్వం.. హైకోర్టు మధ్య పెద్ద రగడ జరిగేలా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: