సినిమాల్లో త‌న స్టామినా ఏంటో సిని ప్రపంచానికి చాటి చెప్పింది. అందంతో ఆక‌ట్టుకుంది. హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంది. అదే హీరోల‌తో స‌మానంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. సినిమాల‌కు విరామం ప్ర‌క‌టించి రాజ‌కీయాల త‌లుపు త‌ట్టింది. బీజేపీ బాట ప‌ట్టి అందులోనే రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకుంది.  తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో తెలంగాణ బిడ్డ‌గా త‌న‌వంతు పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్య‌మానికి సినిస్టార్‌గా  ఊపు తెచ్చింది.  తెలంగాణ కోసం ప్ర‌త్యేక పార్టీని స్థాపించి  ఉద్య‌మానికి ఓ గొంతుక‌గా మారింది. చ‌ట్ట‌స‌భ‌ల్లో పాల్గొని తెలంగాణ వాణిని, భాణిని వినిపించాల‌ని త‌ల‌చింది. త‌న పార్టీని కేసీఆర్ నాయ‌క‌త్వంలోని టీ ఆర్ ఎస్  పార్టీలో విలీనం చేసింది.


కేసీఆర్ అండ‌, స్టార్ ఇమేజ్ తో మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం నుంచి  పోటీ చేసి ఎంపీగా గెలిచింది.  తెలంగాణ ప్ర‌జ‌ల సాధ‌క‌బాధ‌కాల‌ను పార్ల‌మెంట్‌లో ఏక‌రు పెట్టింది.  ఎంపీగా ఓవైపు అభివృద్ధి ప‌నులు, మ‌రోవైపు తెలంగాణ ఉద్య‌మం, ఇంకో వైపు పార్లమెంట్‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏకంగా చేయ‌డంలో నిమ‌గ్న‌మైంది. తెలంగాణ ఉద్య‌మానికి చ‌లించి తెలంగాణ ఇస్తాన‌ని మాటిచ్చిన సోనియాగాంధీ ప‌క్షం చేరారు. సోనియాగాంధీని ఒప్పించ‌డంలో కీల‌క భూమిక పోషించిన అమె కాంగ్రెస్‌లో చేరింది.


మొన్న‌టి ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపేయిన‌ర్ గా కొత్త బాధ్య‌త‌లు నెత్తిన ఎత్తుకుంది. కానీ కాంగ్రెస్‌లో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, పార్టీకి నాయ‌క‌త్వ లోపం అమె ప్ర‌యత్నాల‌కు అడ్డుగా మారాయి. అందుకే తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారం లోకి రాలేదు. దీంతో మ‌న‌స్థాపం చెందిన అమె మ‌రోమారు సినిమా రంగంలోకి రెండో ద‌ఫా ప్రారంభించింది. 13 సంవ‌త్స‌రాల విరామం త‌రువాత ఓ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు. దీంతో అమె సినిమా ప్ర‌యాణం రెండోద‌ఫా సాఫీగా సాగుతుంద‌ని, ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లే అని అంతా భావించారు. కానీ అమె మీడియాతో మాట్లాడుతూ ఓ బాంబ్ పేల్చారు.


ఇంత‌కు ఆ స్టార్ న‌టి ఎవ్వ‌రో చెప్ప‌లేదు క‌దూ. అమె లేడీ అమితాబ్ గా కీర్తినందుకుంటున్న లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి. ఇప్పుడు అమె  సీఎం సీటుపై వేసింద‌ని అమె మాట‌ల్లో అర్థ‌మ‌వుతుంది. త‌న ల‌క్ష్యం సినిమాలు కాద‌ని, సీఎం సీటు అని ప్ర‌క‌టించి సంచ‌ల‌నాల‌కు శ్రీ‌కారం చుట్టింది. విజ‌య‌శాంతి ఏమ‌న్నారో అమె మాట‌ల్లోనే చూద్దాం. రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పేరు పవర్ కోసం ప్రయత్నం చేస్తారని, తన లక్ష్యం అది కాదని విజయశాంతి చెప్పింది. ఉద్యమం విజయవంతం కావాలని కోరుకున్నానని, అది విజయవంతం అయ్యిందని చెప్పింది.  


ఇక అధికారం విషయానికి వస్తే అది సెకండ్ ఇన్నింగ్స్ లో సాధ్యం అవుతుందని చెప్పింది. అంటే విజ‌య‌శాంతి ఆలోచ‌న ప్ర‌కారం సినిమాలు అనేది కేవ‌లం సంధి కాలంలో చేస్తున్న ప‌నే త‌ప్ప ఇదే వృత్తి కాద‌ని స్ప‌ష్టం అవుతుంది. ఇక రాజ‌కీయాలు మానుకునేది లేద‌ని, అధికారం కోసం ప‌నిచేస్తాన‌ని అమె చెప్ప‌క‌నే చెప్పార‌న్న మాట‌. విజ‌య‌శాంతి కోరిక నెర‌వేరుతుందో లేదో కాల‌మే స‌మాధానం చెపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: