ఒక రాష్ట్ర  సీఎంని  కొట్టడం అంటే మాములు విషయం కాదు. ఆలా దెబ్బలు తింటూ కూడా నవ్వుతున్న సీఎం ని ఎప్పుడైనా చూసారా? సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని కోట జంజ్‌గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. 


అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు.  ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్ధానికుల నమ్మకం.జానపద సంప్రదాయం కొరడాతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలుసుకున్న సీఎం తాను కూడా కొరడా దెబ్బలు తింటానన్నారు. పూజ అనంతరం ఆలయ పూజారి కూడా సీఎంను సామాన్య భక్తుడిగానే తలిచి కొరడాతో కొట్టడానికి సిద్దమయ్యాడు.   సీఎంను కొరడాతో కొట్టటానికి ముందు పూజారి సీఎం కు నమస్కరించాడు.   


అనంతరం పూజారి ముఖ్యమంత్రి చేతిపై కొరడా దెబ్బలను కొట్టారు. ఈ సమయంలో భూపేష్ భగల్ సాంప్రదాయ దుస్తుల ధోతి, కుర్తా ధరించి కనిపించారు. ఆరుసార్లు కొరడా దెబ్బలు తినగానే సీఎం ఇంక చాలు అన్నట్లు  చెయ్యి  వెనక్కి తీసుకున్నారు. తర్వాత పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లిపోయారు. కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ నవ్వుతూ, సంతోషంగానే కనిపించారు. 


తర్వాత పూజారి సీఎం కు నమస్కరించాడు.కాగా ఈ జానపద పండుగ ప్రతి సంవత్సరం దీపావళికి చేసే లక్ష్మి పూజల తరువాత జరుపుకుంటారు.  ఇటువంటి ఆచారాలను మూఢ నమ్మకాలుగా కొట్టిపారేయకుండా గౌరవిస్తూ... సీఎం స్థానంలో ఉంది ఆచరించడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యలేదు  భూపేష్ భగల్. ఈ వీడియో ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: