దసరా ముగిసింది, దీపావళి కూడా బైబై చెప్పి వెల్లిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకున్న ఈ పండగలు ఒకెత్తైతే దీపావళి పండుగ తర్వాత యాదవ సోదరులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ పండగ ఒకెత్తు. ఇక ఇప్పటికే ఈ వేడుకలకు చారిత్రక భాగ్యనగరం సిద్ధమైంది. ఈ పండగకోసం అందంగా ముస్తాబు చేసిన దున్నపోతులు సందడి చేస్తున్నాయి. ఇకపోతే నిజాం కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక అస్థిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. కాబట్టి సదర్ వేడుకను మహోన్నతమైన సాంస్కృతిక ఉత్సవంగా యాదవులు అభిర్ణిస్తున్నారు.


యాదవుల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు పశువులను రక్షించాలనే మంచి సంకల్పంతో సదర్ పండగా జరుపుకుంటారు. ఇదేకాకుండా ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేలిమి జాతి మహిషరాజాలు సదర్ సంబరాల్లో సందడి చేస్తాయి.. ఇక ఈసారి జరిగే ఈ ఉత్సవాల్లో ‘రాణా’ ఎంతగానో సందడి చేసింది. హర్యానాకు చెందిన ప్రముఖ దున్నపోతు సుల్తాన్ వారసత్వానికి చెందినదే ఈ రాణా.. ఇకపోతే ప్రస్తుతం రాణా వయసు రెండున్నరేళ్లు. అతి తక్కువ కాలంలోనే భారీ ఆకారంతో ఈ దూడ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


రాణాకు 3 నెలల వయసు ఉన్నప్పుడు 3 లక్షలు ఇచ్చి హర్యానాలో కొనుగోలు చేసినట్లు దాని యజమాని మధు యాదవ్ తెలిపారు. ఇదే కాకుండా 27 కోట్లు విలువ చేసే మరో దున్నపోతు సర్తాజ్. ఈ దున్నపోతు.. ఇప్పటికే నేషనల్ లెవెల్లో.. 25 సార్లు బహుమతులు గెలుచుకుంది. అందుకే.. ఈసారి హైదరాబాద్ సదర్ సంబరాల్లో.. సర్తాజ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలచింది. ఇక హర్యానా నుంచి సర్తాజ్ ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు మూడున్నర లక్షలు ఖర్చయిందని చెబుతున్నారు ఎడ్ల హరిబాబు.


దీని అసలు యజమాని పేరు వీర్ సింగ్. ఈ రోజు ముషీరాబాద్‌లో జరగబోయే సదర్ వేడుకల కోసం.. యాదవ సంఘం నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్.. సర్తాజ్ను హర్యానా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.. ఇక ఈ దున్నపోతులు రాజ భోగాలను అనుభవిస్తూ పెరుగుతుంటాయి. వీటి తిండి ఖర్చు నెల వచ్చే సరికి లక్షల్లో ఉంటుంది. ఇదేకాకుండా వీటి నుంచి సేకరించే వీర్యం కూడ ఎంతో ఖరీదైందని వెల్లడించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: