డబ్బు ఆకాశంలోని చందమామ వంటిది. అందినట్టే ఉంటుంది కాని అందరికి అందదు. ఇక డబ్బు లేకపోవడం వల్ల కలిగే కష్టాలగురించి చెప్పవలసిన అవసరం లేదు. ఒంట్లో ఏదైన అవయం లేకున్న బ్రతకవచ్చూ, పెళ్లాం పిల్లలు లేకున్న బ్రతవచ్చూ, కాని డబ్బులేకుంటే ఈ లోకంలో బ్రతకడం చాలా చాలా కష్టం. అందుకే డబ్బు సంపాదనకోసం మనుషులు పడకూడని కష్టాలు పడతారు. చేయకూడని పనులు చేస్తారు. తమ సుఖాలను ధారపోసైన డబ్బును సంపాధించాలని ఆలోచిస్తారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రపంచాన్ని నడిపేది డబ్బే అలాంటి డబ్బును ప్రతివారు సంపాధించుకోవాలని అనుకుంటారు. కాని అది ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు.


కాని కొన్నికొన్ని సందర్భాల్లో కొందరి జీవితంలోకి వద్దన్న డబ్బు వచ్చి రాత్రికి రాత్రే బిలియనీర్ ను చేస్తుంది. ఇలా అనుకోకుండా కోటీశ్వరులు అయ్యారని తెలియగానే ముందు షాక్ అవుతారు. దాని నుండి కోలుకోడానికి కొంత టైమ్ కూడ పట్టొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 24 ఏళ్ల అబ్బాయి రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. అతని పేరు ఎరిక్ టీసే. ఇతను చైనాకు చెందిన ధనవంతుల కుటుంబానికి చెందిన కుర్రాడు. సినో బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇతని తల్లిదండ్రులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇకపోతే ఇతని తల్లిదండ్రులు ఇతనికి ఇటీవల 3.8 బిలియన్ డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.


సినో బయోఫార్మాస్యూటికల్ ఫౌండర్ అయితన ఎరిక్ తండ్రి, అతని తల్లి కంపెనీ వాటాలో ఐదో వంతును అతనికి ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో ఎరిక్ రాత్రికి రాత్రే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఎరిక్ సంపద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (3.1 బిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం.


ఇకపోతే  రాత్రికి రాత్రే బిలియనీర్ అయిన ఎరిక్ టీసే మాత్రం బిలియనీర్ జాబితాలో తన పేరు చూసుకోవడానికి ఇష్టపడలేదు. తన పేరు బిలియనీర్ల జాబితాలో చేర్చొద్దని, అవసరమైతే టీసే పింగ్ ఫ్యామిలీ పేరును కుబేరుల జాబితాలో చేర్చాలని కోరారు.. చూసారా ముందే అదృష్టవంతుడు దానికి తోడు మరో అదృష్టం నల్లిలా పట్టుకుంది. ఇక ఈ విషయం తెలిసిన వారు ఇతనికంటే అదృష్టవంతుడెవరుంటారు ఈ ప్రపంచంలో అని తెగపొగుడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: