కాంట్రవర్సియల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మసినిమా తీసినా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వర్మ వల్ల కాకుండా.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు వల్లే మరింత జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమాను ఏపీలో రిలీజ్ కు అడ్డు చెప్పడం, వర్మను గేట్ వేలో నిర్భంధించడం, ఎయిర్ పోర్ట్ లో అరెస్టు చేయడం.. చేసి సినిమాకు చంద్రబాబు అండ్ టీమ్ పరోక్షంగా ప్రచారం చేసి పెట్టారు.

 


లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆపకపోతే ఊరుకునేది లేదు.. చంద్రబాబుపై సీన్లు తీసేయాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హడావిడి చేశారు. అప్పటి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి వర్మపై పోలీసు కేసు కూడా పెట్టాడు. ఆరోజు అంత హడావిడి చేసిన టీడీపీ లీడర్లు అదే చంద్రబాబుపై వర్మ ఇప్పుడు తీసిన కమ్మరాజ్యంలోకి కడప రెడ్లు సినిమా విషయంలో ఎందుకు స్పందించటం లేదో అర్ధంకాని ప్రశ్న. పైగా ఇందులో చంద్రబాబును, లోకేశ్ విపరీతంగా ఆడేసుకున్నాడు వర్మ. ఏకంగా చంద్రబాబు స్వయంగా లోకేశ్ కు భోజనం ప్లేటులో పప్పు వడ్డించడం కూడా తీసిపారేశాడు.టీజర్లో జగన్, పవన్ లను కూడా చూపించాడు వర్మ. అయినా వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులెవరూ స్పందించలేదు. 

 


చంద్రబాబు, లోకేశ్ లను దైవాంశ సంభూతుల్లా భావించి వర్మ మీద అంతెత్తు లేచిన టీడీపీ నాయకులు ఇప్పుడెందుకు గమ్మునుండిపోయారో వారికే తెలియాలి. అధికారంలో లేరు కాబట్టి మనకెందుకులే అని మిన్నుకుండిపోయారు.. అనే వాదనలూ లేకపోలేదు. టీజర్ లో మాత్రం బాబు, లోకేశ్ సీన్లే హైలైట్ అయ్యాయి. ప్రస్తుతానికి టైటిల్ తప్ప కథ తెలీదు, ఎవరి క్యారెక్టర్ ఎలా వచ్చిందో కూడా తెలీదు కాబట్టి వాతావరణమంతా తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: