జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నా.. రాజకీయంగా మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. కనీసం తానే స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన భవిష్యత్ పైనే దష్టిపెట్టారు. సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో ఉండేందుకు ప్రిపేరై వచ్చానంటున్న జనసేనాని ఇసుక సమస్యపై పోరాటానికి రెడీ అవుతున్నారు.


విశాఖ పట్నంలో భవన నిర్మాణకార్మికలకు అండగా లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కేవలం జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శించడాన్ని వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. ఆమేరకు పవన్ పై మాటల యుద్ధం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ చరిత్ర తెలుసుకుని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడితే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎదురు దాడి చేశారు.


గత ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీ పవన్‌కు కనిపించలేదా అని అవంతి శ్రీనివాస్ నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ వైయస్‌ జగన్‌ నెరవేర్చారని అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చాలో చెప్పాలని అవంతి శ్రీనివాస్ పట్టుపట్టారు.


సంపూర్ణ మద్య నిషేధంతో మహిళల జీవితాల్లోకి కొత్త వెలుగును సీఎం వైయస్‌ జగన్‌ తీసుకురాబోతున్నారని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మహిళలే ప్రధాన కారణమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఐదేళ్లలో జరిగిన భూ దోపిడీ ఎక్కడా జరగలేదన్నారు. ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన టీడీపీ నేతల లెక్కలు నా వద్ద ఉన్నాయని చెప్పారు.


దమ్ముంటే ఈ విషయంపై టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాలు చేశారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ ద్వారా నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. విశాఖ జిల్లాలో నిర్వహించిన డ్వాక్రా మహిళల రుణాల పంపిణీ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: