మామూలుగా అయితే స్కూల్ కు  వెళ్లే పిల్లలు ఏం చేస్తుంటారు...  ఎప్పుడు సమయం దొరకుద్దా  ఎప్పుడు ఆడుకుందామా అని  చూస్తుంటారు. ఇక  కొంచెం సమయం దొరికిందంటే చాలు టీవీ చూడడం ఆడుకోవడం చేస్తుంటారు. ఏడో తరగతి చదువుతున్న పిల్లలు అయితే ఏం చేస్తుంటాడు... వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తూ  ఆడుకోవడం టీవీ చూడడం చేస్తుంటాడు అంటారా . కానీ ఎక్కడో ఓ బుడతడు   మాత్రం అలా చేయలేదు. ఏడో తరగతిలోనే జాబ్ చేస్తున్నాడు. అది కూడా జీతం ఎంతో తెలుసా... ప్రస్తుతం డిగ్రీ చదివిన వాళ్లు  సైతం పొందలేని  జీతం. ఏకంగా 25 వేల గౌరవ వేతనం పొందుతున్నాడు ఈ బుడతడు. అతని వయసు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతను చదువుతున్న 7వ తరగతి అయినప్పటికీ కూడా ... సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు . ఇంతకీ ఈ బుడతడి కథేంటో తెలుసుకుందాం రండి.

 

 

 

 గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజ్ కుమార్ ప్రియ దంపతులకు 12 సంవత్సరాల కొడుకు శరత్  ఉన్నారు. అయితే ఈ దంపతులిద్దరూ జెమిని క్యాప్  సంస్థలో పనిచేస్తున్నారు. అయితే చిన్నప్పటినుంచి లాప్ టాప్ లను  చూసుకుంటూ పెరిగాడు శరత్. దీంతో శరత్ క కోడింగ్ జావాలపై  ఆసక్తి ని పెంచుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. దీంతో శరత్ కోడింగ్ జావలలో  రాటుదేలాడు . దీంతో ఏడో తరగతి చదువుతున్న శరత్ ఏకంగా  25000 గౌరవ వేతనం తో డేటా సైంటిస్ట్ గా జాబ్ కొట్టేసాడు . అతను చదువుకు ఆటంకం రాకుండా ఉండేందుకు మూడు రోజులు పని చేస్తూ మూడు రోజులు చదువుకునేందుకు అతనికి ఉద్యోగం ఇచ్చింది మాగ్నెట్  సంస్థ . 

 

 

 

 ఇతని టాలెంట్ కు గుర్తించిన శరత్ టాలెంట్ ని గుర్తించిన  మాగ్నైట్ సంస్థ డేటా  సైంటిస్ట్ గా జాబ్  ఇవ్వడంతో పాటు 25వేల గౌరవ వేతనం ఇస్తుంది . అంతే కాకుండా చదువుకునేందుకు కూడా వెసులుబాటు కలిపించింది మాగ్నైట్ సంస్థ  . ప్రస్తుతం 12 ఏళ్ల  శరత్ 25000 సంపాదిస్తున్నాడు. శరత్ ప్రతిభ  గురించి తెలుసుకున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. అయితే పుత్రుడు పుట్టడం కంటే ప్రయోజకుడు అయినప్పుడే తల్లిదండ్రులకు అసలైన పుత్రోత్సాహం అంటుంటారు. మరి పన్నెండేళ్ల కి శరత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మారిపోయి 25000 సంపాదిస్తున్నారు అంటే అది ఆ తల్లిదండ్రులకు ప్రోత్సాహమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: