కిరాణా షాపుల్లో ఒకప్పుడు పప్పు, ఉప్పూ మాత్రమే అమ్మేవారు. తరువాత చూస్తే  అక్కడ దొరకని వస్తువు లేదు, ఫ్యాన్సీ సరుకు కూడా కిరాణాలోనే దొరుకుతోందిపుడు, అలా మల్టీపర్పస్ సర్వీస్ తో కిరాణా దుకాణం తన రూపు రేఖలను చాలాకాలం క్రితమే మార్చుకుంది. ఇపుడు మరో ముఖ్యమైన వస్తువు ఇక్కడ లభ్యమవుతోందట. దానికి సంబంధించిన  కసరత్తు ఇపుడు జరుగుతోంది.


కిరాణా షాపుల్లో మందులను అమ్మేందుకు  అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు నిబంధలను సడలించాలనుకుంటోందిట. ఎలా ఎందుకంటే మారుమూల పల్లెలు, గ్రామాలు ఈ దేశంలో కోట్లలో ఉన్నాయి. అక్కడ కనీసం మందు బిల్లల‌కు కూడా దిక్కులేదు. దాన్ని కొని తెచ్చుకోవాలన్న కిలోమీటర్ల దూరం నడచిపోవాల్సిందే. దాంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.


నిజానికి మందులు అమ్మాలంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన  మెడికల్ షాపులు మాత్రమే ఉండాలి. అయితే  అవి పల్లెలకు దూరంగా పట్టణాలకు చేరువగా ఉన్నాయి. దాంతో  చిన్నపాటి జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుపు చేసినా, ఇలా ఏ రకమైన తలనొప్పులు వచ్చినా కూడా మందు బిల్ల లేక పల్లె జనం అల్ల్లాడిపోతుననరుట. దీనికి గ్రహించిన కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి కిరణా దుకాణాలు మందు బిల్లలు  అమ్మేలా చర్యలు తీసుకుంటోంది. అదే జరిగితే చిన్న చిన్న వ్యాధులకు పల్లెజనం  ఇబ్బందులు పడనక్కరలేదు. మొత్తానికి ఇది మంచి సంస్కరణగానే భావించాలి, అహ్వానించాలి. ఇప్పటికే కిల్లీ బడ్డీలు, కిరాణా దుకాణాలు కొన్ని బెల్ట్ షాపులుగా మారి విచ్చలవిడిగా  మందు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. ఆ విధంగా జనాల ఆరోగ్యం పాడుచేస్తున్న క్రమంలో ఇపుడు ప్రజలకు పనికివచ్చే మందు బిల్లలు అమ్మించడం మంచి పరిణామమేనని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: