ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా.. దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. దీపావళి రోజునుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడుతున్నారు.  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తున్నారు.  అమాయక ప్రజలు, కాశ్మీరేతరులపై దాడులు చేస్తున్నారు.  పైగా ఇప్పుడు కాశ్మీర్లో యూరోపియన్ ప్రతినిధులు పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటననలు చోటు చేసుకోవడం విశేషం.  


పైగా పాక్ అంతర్జాతీయంగా ఒంటరి కావడం, ఎఫ్ఏటిఎఫ్ వంటి సంస్థలు హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కొంటోంది.  దీంతో పాక్ కు ఏం చేయాలో తెలియక ఇండియాపై ఆరోపణలు చేయడం, ఇండియాలోకి ముష్కరులను పంపించి అలజడులు సృష్టించడం వంటివి చేయడానికి రెడీ అవుతున్నది.  పాక్ కుట్రలను ఇండియా ముందుగానే పసిగట్టి వాటిని ఎదుర్కొంటోంది.  ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు.  కాశ్మీర్ విషయంలో ఇండియా తప్పు నిర్ణయం తీసుకున్నారు అని తెలిపేందుకు ఇలా చేస్తోంది.  


ఇక ఇదిలా ఉంటె పాక్ మంత్రి అమీన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీర్ విషయంలో ఇండియా ఇలానే ప్రవర్తిస్తే.. భారత్ తో యుద్ధం చేయడం కంటే మరో మార్గం లేదని, భారత్ కు సపోర్ట్ దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించాడు.  ఇండియాకు సపోర్ట్ దేశాలంటే సౌదీ, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తుందా.. అలాంటి ఆలోచన పాక్ కు వచ్చింది అంటే.. అమెరికా, రష్యా వంటి దేశాలు పాక్ కు తగిన విధంగా బుద్ది చెప్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  


పాక్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో అర్ధం కావడంలేదు.  ఒకవేళ పాక్ యుద్ధమే చేయాలనీ అనుకుంటే.. ఇలా ఉగ్రవాదులను ఇండియాలోకి దొంగతనంగా చొరబడే విధంగా చేయడం దేనికి.. డైరెక్ట్ గా ఇండియాపై యుద్ధం చేస్తున్నాం అని ప్రకటిస్తే సరిపోతుంది కదా.  ఇండియా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది.  ఇండియాతో యుద్ధం చేస్తే పాక్ పరిస్థితి ఏంటి అన్నది ఆ దేశానికీ బాగా తెలుసు.  పీవోకేను కోల్పోవలసి వస్తుంది.  అందులో సమస్య లేదు. చేతకానపుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు. చేసి తిట్లు తినడం దేనికి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: