కీల‌క‌మైన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి కాంగ్రెస్ పార్టీలో ఆవేద‌న‌కు దారితీస్తున్న సంగ‌తి తెలిసిందే. పీసీసీ అధ్య‌క్షుడి స‌తీమ‌ణే..ఓట‌మి పాల‌వ్వ‌డం పార్టీ శ్రేణుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. ఈ ప‌రాజ‌యం స‌మ‌యంలోనే....గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశమైంది. తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికల్లో ఓటమి, మున్సిపల్‌ ఎన్నికలు, ప్రగతిభవన్‌ ముట్టడి, క్రమశిక్షణ ఉల్లంఘన, సభ్యత్వ నమోదు, ఇందిరాగాంధీ, సర్ధార్‌ వల్లభాయ్ పటేల్‌ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా  టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టార్గెట్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో, హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి బాధ్యత నాదే అని  ఉత్త‌మ్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో...ఉత్త‌మ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఊడ‌టం ఖాయ‌మంటున్నారు. అయితే, ఈ ప్లేస్‌ను భ‌ర్తీ చేసే వారిపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది. 


మ‌రోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన‌ టీపీసీసీ కార్యవర్గంలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సరూర్‌నగర్‌లో ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్న సకల జనుల సమరబేరి సభకు కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలని కోరారు. దేశంలో ఆర్థిక మాంద్యానికి, దారితీసిన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలకు కలిగే నష్టాలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ గౌరవ్‌ వల్లబ్‌, ఆర్థిక విశ్లేషకులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నాయకులకు అవగాహన కల్పించారు.అనంత‌రం ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ...వివిధ ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ఆర్థిక మాంద్యానికి కారణమైన బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. 


బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. 6న అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహిస్తారన్నారు. 8న అన్ని జిల్లా కలెక్టరేట్లల ముందు ధర్నా కార్యక్రమాలు చేపడతారన్నారు. చివరగా నవంబరు 15న గాంధీభవన్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేపడతామని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: