తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమ క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది దీని ఫలితంగా అక్కడక్కడ  కార్మికుల మరణాలు కూడా సంభవించాయి. ఈ దశలో తెలంగాణ హైకోర్ట్ కేసీయార్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. ఇకపోతే సమ్మె కారణంగా తెలంగాణాలో పరిస్దితి అస్తవ్యస్తంగా మరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు బంగారు తెలంగాణాలో కార్మికుల చావుడప్పులు వినిపిస్తున్నాయి.


ఇకపోతే హైకోర్టులో తెలంగా ప్రభుత్వ వాదనకు బలం లేకపోవడంతో న్యాయస్దానం కార్మికుల వైపుగా మాట్లాడిందనే విషయం తెలిసిందే. ఇప్పటికే కేసీయార్ మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయోమయంలో ఉండగా కార్మికులు మాత్రం ఈ రోజు సకలజనుల సమర భేరీ సభను  మ.2 నుంచి సా.6గంటల వరకు సరూర్ నగర్ మైదానంలో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇక ఈ రోజు నిర్వహించబోయే ఈ సమ్మెకు ప్రతిపక్షాల మద్దతు సంపూర్ణంగా లభిస్తుండగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు  సకలజనుల సమర భేరీ సభలో పాల్గొనడానికి నగరానికి చేరుకుంటున్నారు..


ఇక తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పై జేఏసి నేతలతో పాటుగా కార్మిక సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీయం కేసీయార్ పాలన నవాబుల పాలనను మించి సాగుతుందని. బాధ్యతగల ఉద్యోగులు సరిగ్గా డ్యూటీలు చేస్తేనే ఆర్టీసీ ఈ రోజు ఈ పరిస్దితిలో ఉందని, అలాంటిది తెలంగాణ ఆర్టీసీని ప్రవేట్‌పరం చేస్తే దోపిడి వ్యవస్దకు దారులను పరిచినట్లేనని ప్రజలు నిలువు దోపిడికి గురవ్వడం ఖాయమని ఈ సందర్భంగా ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్రవేట్ బస్సులు నడిపే డ్రైవర్ల చేతిలో ప్రయాణికుల ప్రాణాలు భద్రంగా ఉంటాయనే హామీనీ కేసీయార్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైన తెలంగాణ సీయం తీసుకునే నిర్ణయం ఎంతవరకు ప్రజలకు మేలుచేస్తుందో తనలో తానే ప్రశ్నించుకోవాలని కోరుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: