అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామం లో పంచాయతీ భవనానికి  ఉన్న జాతీయ జెండా రంగును, తొలగించి వైయస్సార్సీపీ  జెండా రంగును వేస్తోన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .   రాష్ట్రంలో పలు చోట్ల గ్రామ సచివాలయ లకు వైస్సార్సీపీ జెండా  రంగు వేస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి .   తమ్మడపల్లి గ్రామం లో పంచాయతీ భవనానికి జాతీయ జెండా రంగు తొలగించి వైయస్సార్సీపీ  రంగు వేయడం పట్ల  పలువురు మండిపడుతున్నారు . జాతీయ జెండా రంగు తొలగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు .


 ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తావిస్తూ  ఎలాగూ స్మశానాలను కూడా వదలడం లేదని , కనీసం జాతీయ జెండాను గౌరవించాలని సూచించారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు ఆ పార్టీ జెండా రంగును వేస్తున్నారన్న విమర్శలు  విన్పిస్తున్నాయి . దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నాయకత్వం ఖాతరు చేయడం లేదు . ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా , గ్రామ సచివాలయాలయ భవనాలకు తమ పార్టీ జెండా రంగును వేస్తూ,  వస్తున్నారు . అయితే తమ్మడపల్లి గ్రామం లో పంచాయతీ భవనానికి జాతీయ జెండా రంగు ఉన్న , దానిపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగు వేయడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది .


కనీసం జాతీయ జెండా ను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా అన్న విమర్శలు విన్పిస్తున్నాయి . ఈ విషయమై ఆ పార్టీ నాయకత్వం స్పందించి , తమ్మడపల్లి గ్రామం లో పంచాయతీ భవనానికి తిరిగి మూడు రంగుల జెండా కలర్ వేయించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా విన్పిస్తోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: