వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు డ్వాక్రా ఉత్ప‌త్తులను అంత‌ర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు  చేసుకున్న ఒప్పందాల‌కు చెద‌లు ప‌ట్టాయ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటుగా మ‌రో ట్వీట్‌లో ఇసుకు కొర‌త‌పై చంద్రబాబు మాట్లాడుతున్న తీరును దుయ్య‌బ‌ట్టారు. ఇసుక దొర‌క్క కూలీలు ప‌స్తులుంటున్నార‌ని చెపుతూ, మ‌రోవైపు ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకుంటున్నారని చంద్ర‌బాబు  ఆరోపించ‌డాన్ని విజ‌య‌సాయి త‌ప్పు ప‌ట్టారు. ఒక‌సారి విజ‌య‌సాయి చేసిన రెండు వేర్వేరు  ట్వీట్లు ఇలా ఉన్నాయి.


డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో చంద్ర‌బాబు నాయుడు ప్రభుత్వం 2015 నవంబర్లో ఎంఓయూలు కుదుర్చుకుంది. వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్ర & మహీంద్ర, ఓలం అగ్రో లాంటి దిగ్గజ కంపెనీలను పిలిపించి బాబు సినిమా చూపించాడు... ఇప్పుడు ఆ ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి. కానీ కొనుగోళ్లు జరగలేదు. అంటూ ఒక ట్వీట్లో డ్వాక్రా ఉత్ప‌త్తుల‌పై చేసుకున్న ఎంఓయూల తీరుపైన, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యాన్ని ఎత్తి చూపారు విజ‌య‌సాయిరెడ్డి. ఒప్పందం చేసుకోవ‌డం, దాన్ని అమ‌లు చేయ‌డం ఏంట‌నీ విజ‌య‌సాయి ఈ ట్వీట్లో ప్ర‌శ్నించారు.


మ‌రో ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు .. ఇసుక దొరక్క కూలీలు పస్తులుంటున్నారని అంటాడు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అదే నోటితో నింద వేస్తాడు. పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుందని  ఆరోపిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే అసలు బాధ. అంటూ ఇసుక‌పై  చంద్ర‌బాబు  తీరుపై విజ‌య‌సాయి సెటైర్లు వేశారు. ఇప్పుడు విజ‌య‌సాయి రెడ్డి ఇసుక పైన చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ద్వంద వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టారు. ఏదేమైనా విజ‌య‌సాయి బాబును వ‌రుస‌గా ట్వీట్ల‌తో ఏకేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: