తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  48వేలమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.  అయినప్పటికీ ప్రభుత్వం దిగిరావడం లేదు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమకు సంబంధించిన 26 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అన్నది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తున్నది.  


26 డిమాండ్లను 21 పై మాత్రమే చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టి కేవలం రెండు మాత్రమే నెరవేరుస్తామని చెప్పడంతో కార్మికులు అవాక్కయ్యారు.  కనీసం నాలుగు డిమాండ్లు అయినా నెరవేర్చలేరా అంటే ససేమిరా అని ప్రభుత్వం చెప్పింది. ఆర్టీసీకి రూ. 47 కోట్లు ఇవ్వలేని ప్రభుత్వం హుజూర్ నగర్ కు రూ. 100 కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.  దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఈరోజు హుజూర్ నగర్లో సకలజనుల సమరభేరి సభను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభను నిర్వహించుకునే అవకాశం ఉంది.  ఈ సభకు అనేక పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.  రాజకీయ పార్టీల నుంచే కాకుండా వివిధ సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తుండటంతో కార్మికులు ఆనందంలో ఉన్నారు.  కార్మికులకు తెలంగాణ నుంచే కాకుండా ఏపి నుంచి కూడా మద్దతు లభిస్తోంది.  


ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికుల సంఘం నేతలు మద్దతు ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినపుడు.. తెలంగాణాలో ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణాలో ఎందుకు సాధ్యం కాదని అంటున్నారు.  ఏపీలో దీనిపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, త్వరలోనే ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేస్తారని అంటున్నారు కార్మికులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: