ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు... తమ సంబంధించిన పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 26 రోజుకు చేరుకుంది. ఆర్టీసీ విలీనం చేసే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటే ... తమ డిమాండ్లు పరిష్కరించే  వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. అంటే కాకుండా  ప్రభుత్వం ఆర్టీసీ నేతల మధ్య చర్చలు జరిగినా అవి కూడా అర్దాంతరంగా ముగియటం తో  ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం తన మొండి పట్టు వీడడం లేదు. దీంతో  సమ్మె ముగింపు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే నేడు హైదరాబాదులో ఆర్టిసి నేతలు  సకల జనుల సమరభేరి  పేరుతో భారీ బహిరంగ సభను  నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జీయర్ స్వామి కి ఎంత భక్తుడు తెలిసిన విషయమే. ఇటీవల సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరునక్షత్రోత్సవం  కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం  కొందరు ఆర్టీసీ సంఘాల నేతలు ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామిని కలిసి...సమ్మె విషయంలో  ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేలా  ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారని చిన్నజీయర్ స్వామిని విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయంలో కేసిఆర్  పూర్తి మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని ...వారికీ  సానుకూలంగా స్పందించేలా  సూచించాలని విజ్ఞప్తి చేసారు ఆర్టీసీ నేతలు . అయితే గతంలో కూడా రెవెన్యూ శాఖ ఉద్యోగులు కూడా చిన్నజీయర్ స్వామిని కలిసి...  ప్రభుత్వం తమ పట్ల  సానుకూలంగా స్పందించేలా సీఎం కేసీఆర్ సూచించాలని చిన్న జీయర్ స్వామి కోరారు . 

 

 

 

  ఇక ఇప్పుడు తాజాగా ఆర్టీసి జేఏసీ నేతలు చినజీయర్ స్వామిని  కలిసి తమ సమస్యలు విన్నవించి... ప్రభుత్వం తమ సమస్యలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించి పరిష్కరించేలా సూచించాలని  విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా నేడు  హైదరాబాద్ లో ఇంకొద్దిసేపట్లో సకల జనుల సమరభేరి భారీ బహిరంగ సభ  మొదలు కాబోతుంది. ఈ భారీ బహిరంగసభకు ఉద్యోగ సంఘాలు,  కార్మిక సంఘాలు,  కులసంఘాలు,  సహా పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి . కాగా  సకల జనుల సమారభేరి  ద్వారా కెసిఆర్ మెడలు వంచి తమ డిమాండ్లను పరిష్కారించుకుంటాని  ఆర్టిసి నేతలు అనుకుంటున్నారు. అంతేకాకుండా కెసిఆర్ అనుగ్రహం కోసం చిన్న జీయర్ స్వామి ని కూడా వేడుకోవడం తో కేసీఆర్ సమ్మె పై  ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: