సరూర్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సకల జనుల సమరభేరి సభను ఏర్పాటు చేశారు.  ఈ సమరభేరి సభ కొద్దిసేపటి క్రితమే మొదలైంది.  ఈ సభకు భారీ ఎత్తున కార్మికులు కదిలి వచ్చారు.  ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చకుంటే సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తామని గతంలోనే చెప్పారు. కాగా, ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసినట్టుగా తెలుస్తోంది.  మాములుగా ఇలాంటి సభలు పొలిటికల్ పార్టీలు నిర్వహిస్తుంటాయి.  కానీ, ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సకల జనులసమరభేరి సభకు కదిలివస్తున్నారు.  


ఈ సభకు దాదాపుగా 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు.  అయితే, సమరభేరి సభకు ఐదువేలకు మించి హాజరు కాకూడదని, ఎవరెవరు వేదికపై మాట్లాడబోతున్నారో ముందుగా పోలీసులకు ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు జరీ చేశారు.  అయితే,  ఈ సభకు తెలంగాణలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి.  పార్టీ శ్రేణులు ఈ సభకు భారీ జనసమీకరణ చేసినట్టు తెలుస్తోంది.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ సమ్మెకు దిగారు.  ప్రభుత్వానికి ముందుగానే నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, అందుకే సమ్మె చేశామని చెప్పింది.  దసరా, బతుకమ్మ సమయంలో సమ్మె చేయడంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. అసలే ఆర్టీసీ అప్పుల్లో ఉందని, ఈ సమయంలో ఇలా సమ్మె చేస్తే ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వం చెప్పింది.  


కానీ, కార్మికులు మాత్రం ఆర్టీసీని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా తమ 26 డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  కానీ, 21 డిమాండ్లపై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం రెండు మాత్రమే ఆమోదిస్తామని, మిగతా వాటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో, హుజూర్ నగర్ కు ఎలా రూ. 100 కోట్లు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.  కాగా, అందరి చూపులు ఇప్పుడు సరూర్ నగర్లో జరుగుతున్న సకలజనుల సమరభేరి సభపైనే ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: